Ads
టీమ్ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి తెలిసిందే. ప్రస్తుతం టీం లో చోటు కొల్పోయినప్పటికీ కూడా ఒకప్పుడు ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు సృష్టించాడు. అభిమానులు ఆయనను గబ్బర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మంచి ఇన్నింగ్స్ ఆడినప్పుడు శిఖర్ ధావన్ మీసం మేలేసే తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. అయితే శిఖర్ ధావన్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ హడావిడి ఉన్న నేపథ్యంలో ఆ పోస్ట్ ఇప్పుడు పెద్ద మంట రాజేసింది.
Video Advertisement
ఇంతకీ ఏంటా పోస్ట్ అనుకుంటున్నారా… మీకు 2019లో ఆడిన రోహిత్ శర్మ కావాలా? లేదా 2023లో ఆడుతున్న రోహిత్ శర్మ కావాలా…? అంటు పోల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇది రోహిత్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. తీరా పోల్ లో ఎవరు దేనికి ఎక్కువ ఓట్లు వేశారు అని చూస్తే 80% పైగా 2023 లో ఆడిన రోహిత్ శర్మ కావాలి అంటూ ఓటేశారు.
పలువురైతే 2019లో వరల్డ్ కప్ లో రోహిత్ బ్యాటింగ్ ను మర్చిపోగలమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2019లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ కూడా… రోహిత్ ఐదు సెంచరీలు చేసి వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటికి ఆ రికార్డు రోహిత్ పేరున ఉంది. అయితే 2023 లో కూడా రోహిత్ కెప్టెన్ గా టీంని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఒక సెంచరీ 3 అర్థ సెంచరీలతో 500 పైగా పరుగులు చేశాడు.
మీకు ఏ రోహిత్ శర్మ కావాలని అడిగితే అభిమానులు తేల్చుకోవడం కష్టమైన విషయమే. అసలు ఇలాంటి సమయంలో శిఖర్ ధావన్ ఎందుకు పోల్ క్రియేట్ చేశాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా రోహిత్ శర్మ ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా విజృంభించి ఆడి ముందుండి టీం ని నడిపిస్తూ వరల్డ్ కప్ సాధించాలని యావత్ భారతదేశం అంతా కోరుకుంటుంది. కాగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
Also Read:రోహిత్ గిల్‌ని ఎందుకు వెనక్కి పిలిచాడు?
End of Article