Ads
ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. వండే ప్రపంచ కప్ లో అవకాశం దొరకగానే తన ఏంటో నిరూపించుకున్నాడు. భీకరమైన ఫామ్ తో నెంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు. అంతకుముందు షమీ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిందే. వాటన్నిటిని దాటుకుని, కసిగా ప్రయత్నించి, ప్రాక్టీస్ చేసి, ఫామ్ పై దృష్టి పెట్టి టీంలో చోటు దక్కించకున్నాడు.
Video Advertisement
షమీ క్రికెట్ లోకి రాకముందు చాలా పేదరికం అనుభవించేవాడు. ఆర్థికంగా బాగా వెనుకబడిన కుటుంబం. కానీ కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు షమీ దశ తిరిగిపోయింది. కోట్లకు అధిపతి అయ్యాడు. లగ్జరీ కార్లను కొన్నాడు.కార్ లు అంటే షమీ కి బాగా ఇష్టం. తన సొంత గ్రామంలో పాత ఇంటి నుండి లగ్జరీ ఫామ్ హౌస్ నిర్మించాడు.
ప్రతి ఏడాది షమీ నికర ఆదాయం పెరుగుతూ వస్తుంది. 2022లో షమీ నికర ఆదాయం 45 కోట్లగా ఉంది. ఇప్పుడు దాదాపు 55 కోట్లకు పెరిగింది. అలాగే వార్షిక ఆదాయం ఏడాదికి 8 కోట్లు ఉంది. ఐపీఎల్ ద్వారా, ప్రకటనల ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 6.25 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. బీసీసీఐ కాంట్రాక్టు ప్రకారం ఏడాదికి 5 కోట్లు వస్తాయి. అలాగే ప్రకటన ద్వారా కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాగే షమీ వద్ద టయోటా ఫార్చునర్, బిఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
అలాగే కోటి రూపాయలు విలువ చేసే జాగ్వార్ ఎఫ్ టైప్ స్పోర్ట్స్ కార్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్ లో 12 నుండి 15 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టాడు.తన భార్య హాసీన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. భరణం కింద ఆమెకు నెలకి ₹1,50,000 చెల్లిస్తున్నాడు. షమీకి ప్రస్తుతం 33 సంవత్సరాలు వయస్సు. ఇంకా కొంతకాలం క్రికెట్ ఆడతాడు కాబట్టి షమీ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.
End of Article