Ads
ఐపీఎల్ చరిత్రలో సక్సెస్ ఫుల్ జట్టు అంటే గుర్తొచ్చే జట్టు ముంబయి ఇండియన్స్. ఇప్పటివరకు ఐపీఎల్ లో 16 సీజన్‌లు పూర్తి అయ్యాయి. వాటిలో ఐదు సార్లు విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఈ విజయానికి కారణం టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పవచ్చు.
Video Advertisement
అలాంటి సారధి రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తూ ముంబయి ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. రోహిత్ ను తప్పించడంతో ఆ జట్టు పై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రోహిత్ ను తప్పించడం పై మహేలా జయవర్ధనే స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024కు ముందు కెప్టెన్ మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్ళ నుండి జట్టును నడిపించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. అత్యంత విజయవంతమైన టీమ్ గా ఐపీఎల్‌లో కొనసాగుతున్న, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా ముంబయి ఇండియన్స్‌కు చాలా పేరుంది. ఈ జట్టుకు 2013లో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్ లో కప్ ను అందించిన రోహిత్, పదేళ్లుగా ఆ జట్టుకు ఎన్నో విజయాలు సాధించాడు.
ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. జట్టు పై కెప్టెన్‌గా, ఫ్యాన్స్ పై తనదైన ముద్రను వేశాడు. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్‌గా లేని ముంబై జట్టును ఊహించుకోవడం ఫ్యాన్స్ మింగుడుపడడం లేదు. అలా చేయడం చాలామందికి షాక్ కి, ఆగ్రహానికి గురి చేసింది. రోహిత్ ను తప్పించడం పై సోషల్ మీడియాలో ముంబై జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం పై తాజాగా గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే రెస్పాండ్ అయ్యారు.2024 సీజన్ నుండి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నట్లు జయవర్ధనే వెల్లడించారు. ‘ఎప్పుడైనా ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే జట్టు నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటిదే ఈ డిసిషన్, రోహిత్ మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్, హర్భజన్, పాంటింగ్ లు టీమ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడమే కాకుండా ముందుచూపుతో కూడా నడుచుకున్నారని అన్నారు. ఇక రోహిత్ శర్మ సారధ్యంలో జట్టు అత్యుత్తమ ఫలితాలను అందుకుంది. అతని కెప్టెన్సీకి అభినందనలు. ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్లలో ఒకరైన రోహిత్ ఎక్స్పీరియన్స్ టీమ్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అంటూ జయవర్ధనే పేర్కొన్నాడు.
Also Read: ఎవరు ఈ అరవెల్లి అవనీష్ రావు..? ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
End of Article