Ads
ఐపీఎల్ ఫ్రాంచైజీ ప్రతి సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా మారుతూ ముందుకు వెళుతుంది. ఫ్రాంచేజీల మధ్య పోటీ, ఆటగాళ్ల మధ్య పోటీతో రసవత్తరంగా మారుతుంది. ఇప్పుడు 2024 ఐపీఎల్ కి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తాజాగా ఆటగాళ్ల మినీ వేలం దుబాయ్ లో జరిగింది. ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధర పలికారు.
Video Advertisement
మొత్తం 70 స్లాట్ లు ఉండగా 335 మంది దేశ, విదేశీ ఆటగాళ్లు వేలం జాబితాలో ఉన్నారు. పది ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. మొదటగా వెస్టిండీస్ ఆటగాడు రోవ్ మాన్ పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్ కత్తా జట్లు పోటీపడ్డాయి. కోటి రూపాయలతో మొదలైన వేలంలో 7.40 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది.
హ్యారీ బ్రూక్ వేలం రెండు కోట్లతో మొదలవగా, రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. నాలుగు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ హీరో ట్రాఫిక్ హెడ్ కోసం సన్ రైజర్స్, csk పోటీ పడ్డాయి. అయితే 6.80 కోట్లకు సన్ రైజర్స్ దక్కించుకుంది. మరో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అమ్ముడవకుండా ఉండిపోయాడు. ఇక సౌత్ ఆఫ్రికా ఆటగాడు రోలీ రోసొవ్ కూడా అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. భారత్ ప్లేయర్లు మనీష్ పాండే కరుణ నాయర్ లు కూడా అన్ సోల్డ్ గానే ఉన్నారు
End of Article