Ads
క్రికెట్ అభిమానులు మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ వేలం ఇప్పుడు మొదలు అయ్యింది. సాధారణంగా ఐపీఎల్ కి అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఐపీఎల్ ప్లేయర్స్ కి కూడా అంతే.
Video Advertisement
అలా ఆస్ట్రేలియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ మన తెలుగు వారికి ఎంత దగ్గర అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున డేవిడ్ వార్నర్ ఆడారు. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో ఎన్నో తెలుగు పాటలకి డేవిడ్ వార్నర్ డాన్స్ చేసి సోషల్ మీడియాలో అవి షేర్ చేశారు. తెలుగు డైలాగ్స్ చెప్పడం, తెలుగు పాటలకు డాన్స్ చేయడం ఇలాంటివి ఎన్నో చేశారు. డేవిడ్ వార్నర్ భార్య, పిల్లలు కూడా డేవిడ్ వార్నర్ తో కలిసి ఇలా డాన్స్ చేసేవారు. దాంతో క్రికెట్ చూడని వారికి కూడా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయ్యారు.
అయితే ఇప్పుడు డేవిడ్ వార్నర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. మరొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 6.8 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ కి చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ టీం డేవిడ్ వార్నర్ ని ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో బ్లాక్ చేసింది. ఇదే విషయాన్ని డేవిడ్ వార్నర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంతే కాకుండా ట్రావిస్ హెడ్ ని కూడా తన పోస్ట్ లో ట్యాగ్ చేశారు. ఈ విషయాన్ని డేవిడ్ వార్నర్ సీరియస్ గా తీసుకోలేదు. సరదాగానే ఈ పోస్ట్ షేర్ చేశారు. కానీ చూస్తున్న అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. “అంత పెద్ద జట్టు యాజమాన్యం, అంత పెద్ద ప్లేయర్ తో ప్రవర్తించే విధానం ఇదేనా?” అంటూ ఫైర్ అవుతున్నారు. “అసలు బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : ఐపీఎల్ మినీ వేలం… రికార్డు ధర పలికిన ఆటగాళ్లు…!
End of Article