Ads
సనా గంగూలి.. ఈమె గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సౌరవ్ గంగూలీ ముద్దుల కూతురు గానే కాకుండా నృత్య ప్రదర్శనల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సనా. ఆపై 21 సంవత్సరాలకే భారీ వేతనంతో ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. సనా కోల్కతాలోని లోరేటో హౌస్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేయటానికి లండన్ వెళ్ళింది.
Video Advertisement
సనా తన చదువుతోపాటు ఎనాక్టస్ యుసిఎల్ లో పూర్తి సమయం పని చేసింది. ఈ ఎనాక్టస్ యుసిఎల్ అనేది వ్యాపారవేత్తలకు, పెద్ద కార్పోరేట్లకు వారి సొంత సామాజిక సంస్థలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో హెచ్ఎస్బిసి, కే పి ఎం జి, గోల్డ్ మెన్ సాచ్స్ వంటి కంపెనీలతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలతో కలిసి పని చేసే అవకాశం ఆమెకు లభించింది.
2022 జూన్ నుంచి పీడబ్ల్యుసి లో ఇంటర్న్ గా పనిచేస్తుంది సనా. పిడబ్ల్యుసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సలహా కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 152 దేశాల్లో విస్తరించి ఉంది ఈ కంపెనీలో 3.28 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. పిడబ్ల్యుసి తమ వద్ద ఇంటర్న్ షిప్ చేస్తున్న విద్యార్థులకు భారీగానే వేతనం చెల్లిస్తుంది.
UK.indeed. Com వెబ్సైట్ ప్రకారం వీడబ్ల్యుసి ఇంటర్నెట్ షిప్ సమయంలో సంవత్సరానికి సగటున 30 లక్షల జీతం ఇస్తోంది. దీని ప్రకారం సనాకు కూడా 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం వస్తుందని అనుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే సనా తనకంటూ ఇంత పెద్ద వేతనంతో ఉద్యోగం సంపాదించడం అంటే నిజంగా అభినందించాల్సిన విషయం.
End of Article