IPL2024 GT vs MI:ఈజీగా గెలిచే మ్యాచ్ లో కూడా “ముంబై ఇండియన్స్” ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఇవే.!

IPL2024 GT vs MI:ఈజీగా గెలిచే మ్యాచ్ లో కూడా “ముంబై ఇండియన్స్” ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఇవే.!

by Harika

Ads

ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైంది. 2012 సీజన్‌ నుండి మొదటి మ్యాచ్ ఓడిపోవడం ముంబై ఆనవాయితీ అనుకుంట. టార్గెట్ తక్కువగానే ఉంది…ఈసారి ముంబై గెలుస్తుంది అనుకున్నారు. కానీ చివరి ఆరు ఓవర్లలో.. చేతిలో ఏడు వికెట్లున్నా 48 రన్స్‌ చేయలేక ఓటమి పాలైంది. పాండ్యా కెప్టెన్సీ పై కూడా ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది ముంబై.

Video Advertisement

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. గుజరాత్ బాట్స్మన్ లో సాయి సుదర్శన్(39 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 45), శుభ్‌మన్ గిల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), రాహుల్ తెవాటియా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు,గెరాల్డ్ కోయిట్జీ రెండు వికెట్లు పడగొట్టాడు,పియూష్ చావ్లాకు ఓ వికెట్ పడగొట్టారు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్…20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవాస్(38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో ఒమర్జాయ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి గల మూడు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

#1. అతి విశ్వాసం:
‘చివరి 5 ఓవర్లలో 42 పరుగులు చేయలేమా? అనే అతి విశ్వాసమే మా ఓటమికి కారణమైంది అని మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా తెలిపారు. గతంలో ఇలాంటి లక్ష్యాలు ఎన్నో ఛేదించడంతో ఇది తక్కువ అంచనా వేసాము అన్నారు.

#2. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ
బాట్స్మన్ గా, కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు హార్దిక్ పాండ్య. బుమ్రా, కొయెట్జీ లాంటి ఫాస్ట్ బౌలర్లు ని పెట్టుకొని మొదటి స్పెల్ తానే వేసాడు. తీరా ఒక్క వికెట్ కూడా తీయలేదు. పైగా 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నాడు. సరైన బౌలర్లకు పవర్ ప్లే లో బౌలింగ్ ఇవ్వలేదు. ఇంకా ఫీల్డింగ్ పోసిషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బాటింగ్ కి కూడా చేసింగ్ చేయాల్సిన టైం లో రాకుండా టిమ్ డేవిడ్ ని బాటింగ్ కి పంపించాడు. చివర్లో బాటింగ్ కి వచ్చి ఫినిష్ చేయకుండానే అవుట్ అయిపోయాడు.

#3. బ్యాటింగ్ లో లోపం:
ఛేజింగ్ లో రోహిత్ శర్మ (43), నమన్ ధిర్ (20) ఇన్నింగ్స్​ను నిలబెట్టినప్పటికీ…కీలక సమయంలో డెవాల్డ్ బ్రేవిస్ (46) అవుట్ అయ్యారు. దీంతో రన్ రేట్ చాలా తగ్గిపోయింది. తిలక్ వర్మ 25 పరుగులు చేసినప్పటికీ..మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయారు. చివర్లో ప్రెషర్ కి టిమ్ డేవిడ్ (11), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) లు కూడా అవుట్ అయిపోయారు. దీంతో ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్ లో ఓడిపోయారు ముంబై ఇండియన్స్.

 


End of Article

You may also like