Home Sports Adda IPL అభిమానులు ఈ అమ్మాయిని చాలా మిస్ అవుతున్నారు అంట..! ఇంతకీ ఈమె ఎవరంటే..?

IPL అభిమానులు ఈ అమ్మాయిని చాలా మిస్ అవుతున్నారు అంట..! ఇంతకీ ఈమె ఎవరంటే..?

by Mohana Priya

ఐపీఎల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఎన్నో కోట్ల మంది అభిమానులు ఐపీఎల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐపీఎల్ రాకముందే దాని గురించి ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు ఐపీఎల్ మొదలైపోయింది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కెమెరామెన్ ఆడియన్స్ ని కవర్ చేసినప్పుడు కొంత మంది అమ్మాయిలు చాలా ఫేమస్ అయ్యారు. కావ్య మారన్. హైదరాబాద్ జట్టు ఓనర్ అయిన కావ్య, వాళ్లు వాడే ప్రతి మ్యాచ్ కి వస్తారు. ఆరోజు మ్యాచ్ కి ఎంత కవరేజ్ ఉంటుందో, కావ్యకి కూడా అంతే కెమెరా కవరేజ్ ఉంటుంది.

deccan chargers hyderabad owner gayatri reddy

బాగా ఆడినప్పుడు ఆనంద పడడం, బాగా ఆడనప్పుడు బాధపడడం ఇవన్నీ కూడా కెమెరాలో షూట్ చేస్తారు. అవన్నీ ఎంతో మంది ప్రేక్షకులు చూశారు. అలా చాలా మందికి కావ్య తెలిశారు. అయితే కావ్య కంటే ముందు, సోషల్ మీడియా ఇంత పాపులర్ అవ్వకముందు ఒక వ్యక్తి కోసం ఇలాగే అభిమానులు ఎదురుచూసేవారు. ఆమె వచ్చారు అంటే కెమెరా కళ్ళు అన్ని ఆమె పైనే ఉండేవి. పేపర్ లో ఆమె వచ్చిన మ్యాచ్ లో ఫోటోలు పడేవి. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ జట్టుని సపోర్ట్ చేయడానికి ఈమె వచ్చేవారు. ఆమె పేరు గాయత్రి రెడ్డి. డెక్కన్ క్రానికల్ పేపర్ అధినేత టీ వెంకటరామిరెడ్డి కూతురు.

deccan chargers hyderabad owner gayatri reddy

డెక్కన్ చార్జర్స్ జట్టుని వీళ్ళు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ వంటి ఎంతో మంది ప్లేయర్స్ కి వెలుగులోకి రావడానికి డెక్కన్ చార్జర్స్ ఒక దారిగా నిలిచింది. 2009 లో వీళ్లు ఐపీఎల్ కప్ కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు కావ్య ఎలా అయితే వస్తున్నారో, అంతకుముందు గాయత్రి కూడా అలాగే వెళ్లేవారు. అప్పుడు సోషల్ మీడియా ఇంతగా ప్రచారం పొందలేదు కాబట్టి ఆమె వస్తున్నారు అంటే ఆమె అభిమానులు టీవీలకి అతుక్కుపోయేవారు. ఇప్పటికి కూడా చాలా మంది గాయత్రిని మిస్ అవుతున్నారు. గాయత్రి రెడ్డి డెక్కన్ క్రానికల్ లో ఎడిటర్ గా కూడా చేస్తున్నారు.

deccan chargers hyderabad owner gayatri reddy

ఇప్పుడు గాయత్రి రెడ్డి భాటియా గా సోషల్ మీడియాలో ఉన్నారు. అనీష్ భాటియా అనే వ్యక్తిని గాయత్రి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు గాయత్రి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ కింద కూడా ఆమెని మిస్ అవుతున్నట్టు కామెంట్స్ ఉంటాయి. ఇటీవల రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ సాంగ్ బాగుంటుంది అని అన్న కామెంట్ ని కూడా గాయత్రి రెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లాగా పెట్టారు. అప్పుడు మళ్ళీ ఆమె సోషల్ మీడియాలో ఉన్నట్టు అందరికీ తెలిసింది. దాంతో ఆమె పోస్ట్ లకి ఐపీఎల్ లో ఆమెని మిస్ అవుతున్నట్టు కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

ALSO READ : “ఆడవాళ్ళ” కి మాత్రమే కాదు… “మగవాళ్ళ” కి కూడా సమస్యలు ఉంటాయి అని చూపించిన 9 సూపర్ హిట్ సినిమాలు..!

You may also like