Ads
లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్ అనడానికి భారత అండర్ 19 క్రికెటర్ యశస్వి జైస్వాల్ జీవితమే ఉదాహరణ ..యశస్వి జైస్వాల్ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు. అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు అదే అతన్ని కరోడ్‌పతిని చేసింది. పానీపూరి అమ్మే స్టేజ్ నుంచి కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది అతను నమ్ముకున్న క్రికెట్ జీవితం. ఈసారి ఐపీఎల్ వేలంలో జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది.
Video Advertisement
ఈ 17 ఏళ్ల ఈ ముంబై కుర్రాడి గతం గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్నేళ్ల కిందట రోడ్డు పక్కన పానీ పూరి అమ్మి రోజులు గడిపాడు. ఉత్తరప్రదేశ్‌లో పేద కుటుంబానికి చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే కోరికతో ముంబైకి చేరుకున్నాడు యశస్వి నిర్ణయానికి తల్లితండ్రులు అడ్డుచెప్పలేదు. ముంబయి చేరుకున్న తర్వాత ఓ డైరీలో పని చేసుకుంటూ… స్థానికంగా క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. అయితే క్రికెట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడంలేదని యజమాని అతణ్ని పనికి వద్దన్నాడు
అదితెలిసిన ఒక బంధువు కొన్ని రోజులు తన ఇంట్లో ఉండమని ఆశ్రయం కల్పించాడు. అది కూడా ఇరుకైందే కావడంతో తను వేరే ప్లేస్ చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆజాద్ మైదానంలోని ముస్లిమ్ యునైటెడ్ క్లబ్‌కు చెందిన గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు. మూడేళ్ల పాటు యశస్వి అక్కడే ఉన్నాడు.అందులో సరైన వసతులు ఉండేవి కావు. కరెంటుండేది కాదు, మూత్రశాలా లేదు. అయినా అందులోనే సర్దుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు.
డబ్బులు సరిపోక కొన్ని కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం యశస్వి విడిచిపెట్టలేదు. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ప్రోత్సహించారు. యశస్వి ప్రతిభను గుర్తిచిన జ్వాలా సింగ్ అనే కోచ్ సరైన శిక్షణ ఏర్పాటు చేసాడు ఎ-డివిజన్ ఆటగాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తూ… గత ఏడాది అతను శ్రీలంకలో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్‌కు సిరీస్ అందించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్-19 జట్టు ముక్కోణపు సిరీస్ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీచేసిన పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్ సాధించి నేడు ఐపీఎల్ కు కొనుగోలు చేయబడ్డాడు.
అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఫైనల్లో హాట్ ఫేవరెట్ ఇండియాను ఓడించి, విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్.. మ్యాన్ ఆఫ్ ది టీర్నీ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో యశస్వి.. 6 మ్యాచ్‌ల్లో 400 పరుగులు సాధించి, టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో ఒక సెంచరీ సహా 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై రికార్డుస్థాయిలో సెంచరీ నమోదు చేశాడు. ఫైనల్లో 88 పరుగులు సాధించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బ్యాట్‌తోనే కాకుండా జైస్వాల్ బంతితోనూ రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ సహా మొత్తం 3 వికెట్లు తీశాడు. త్వరలో ఇండియా టీమ్ కు కూడా సేవలందించాలని ఆశిద్దాం.
400 runs from 6 games ✅
4 fifties and a hundred ✅
Hundred in the semi-final ✅
88 in the final ✅
3 wickets with the ball ✅#TeamIndia’s Yashasvi Jaiswal bagged the Player of the Tournament award at the #U19CWC. ?? pic.twitter.com/PwiOkMqLh4— BCCI (@BCCI) February 9, 2020
End of Article