Ads
కరోనా దెబ్బ ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలు కుదేలు అయిపోయాయి.కాని కరోనా వల్ల అతి పెద్ద నష్టం చూసింది ఒకటి సినీ రంగం అయితే రెండవది క్రీడా రంగం.ఈ రెండు రంగాలు ప్రస్తుతం తమ ముందున్న సవాళ్ళను ఎదుర్కోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ముఖ్యంగా క్రికెట్ బోర్డ్ లు తొలి ప్రయత్నంగా ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ – వెస్ట్ ఇండీస్ టూర్ ను నిర్వహిస్తున్నాయి.ఇవి ఆశించిన మేర ఆర్థిక వనరులను రాబట్టలేక బోర్డ్ లకు కష్ట కాలాన్ని తెచ్చి పెడుతున్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ టీ20 కప్ ను ఈ సంవత్సరం సెప్టెంబర్,నవంబర్ లో నిర్వహించాల్సిన ఆస్ట్రేలియా బోర్డ్ చేతులెత్తేసింది.
Video Advertisement
దానితో ఐసీసీ టీ20 కప్ ను వాయిదా వేసింది. దీనితో క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయో అని వెయిట్ చేస్తున్నా అభిమానులందరికీ ఇది పెద్ద షాక్ అయింది.ఇక ఐసీసీ తాజా నిర్ణయంతో ఇప్పట్లో మ్యాచ్ లు జరగడం కష్టమని తేలిపోయింది.క్రికెట్ అభిమానులు ఇప్పటికీ ఐపీఎల్ మిస్ అవుతున్నామని తెగ ఫీల్ అవుతున్నారు.ఐసీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ అభిమానులకు మరింత నిరాశ ఎదురవుతుంది.
End of Article