129
Ads
మొదట వెస్ట్ ఇండీస్ లో డొమెస్టిక్ టి20 క్రికెట్ ప్రైవేట్ గా స్టాండ్ ఫోర్డ్ నిర్వహించేది.కాని స్టాండ్ ఫోర్డ్ ఫ్రాడ్ చేసిన కారణంగా అరెస్ట్ అయ్యింది.దానితో వారు నిర్వహించే టోర్నీని కరేబియన్ టీ20 గా నామకరణం చేసి దాని నిర్వహణ బాధ్యతలను వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డ్ చేపట్టింది. ఆతరువాత ఈ టోర్నీని 2013 లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ గా మార్చారు.ఈ లీగ్ కు హీరో మోటార్ కాప్ స్పాన్సర్ షిప్ అందిస్తుంది.దానితో ఈ టోర్నీ హీరో సీపీఎల్ గా మారింది.
Video Advertisement
ఈ టోర్నీలో ఆరు టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీం 15 మంది ప్లేయర్స్ తో కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాయి.మొదటి లీగ్ లో జమైకా తలవాస్ గయానా అమెజాన్ వారియర్స్ ను ఓడించి లీగ్ టైటిల్ ను గెలిచారు.ప్రస్తుతం సీపీఎల్ సక్సెస్ ఫుల్ గా ఎనిమిదవ ఎడిషన్ పూర్తి చేసుకోవడానికి ఈ నెల 18న మొదలవ్వనున్నది.
End of Article