Ads
మన ఐపీఎల్ లో అతి తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ కొట్టడం ఆపై మ్యాచ్ గెలిచాక వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి.అందుకే ఇండియాలో వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కు మంచి డిమాండ్ ఉంది.దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఐపీఎల్ ఆడే ప్రతి టీం మినిమం తమ స్క్వాడ్ లో ఒక వెస్ట్ ఇండీస్ ప్లేయర్ ను ఉంచుకుంటుంది.ఇక ఇలాంటి వెస్ట్ ఇండీస్ ప్లేయర్ టీంలో ఒకరుంటునే ఫుల్ ఫన్ ను పొందే మనం.ఇక టీంలో మొత్తం వాళ్ళే ఉంటే మనం ఎలా ఎంజాయ్ చేయచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Video Advertisement
ఇలాంటి ఫన్ ను మనం వెస్ట్ ఇండీస్ ఐపీఎల్ అయిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో చూడవచ్చు. కరోనా పుణ్యాన అందరూ ఈ లీగ్ అటకెక్కింది అనుకున్నారు. కాని ఈ నెలలోనే ఈ ఈవెంట్ ను నిర్వహించాలని సీపీఎల్ నిర్వహకులు నిర్ణయించారు.ఇక ఈ టోర్నమెంట్ ఆగస్టు 18న మొదలయ్యి సెప్టెంబర్ 10న ముగియనున్నది.మరి కరోనా ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో ఈ టోర్నమెంట్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి నిర్వహకులు ఎలాంటి నిబంధనలను పెడతారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
End of Article