Ads
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా శనివారం నాడు భారతదేశానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇందుకు కారణం సురేష్ రైనా వ్యక్తిగత సమస్యలట. జాగరణ్ కథనం ప్రకారం సురేష్ రైనా బంధువుల లో ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారట.
Video Advertisement
పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువుపై దాడి జరిగిందట. ఈ ఘటన ఆగస్టు 19వ తేదీ రోజు జరిగిందట. సురేష్ రైనా బంధువులు టెర్రస్ పై పడుకున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి దాడికి పాల్పడ్డారట.
దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట. సురేష్ రైనా కి సోదరుల వరస అయిన వాళ్ళకి (కజిన్స్) కి ఇద్దరికి ఈ దాడిలో గాయాలు అయ్యాయట. సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట.
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కె ఎస్ విశ్వనాథన్ “కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సురేష్ రైనా భారతదేశానికి తిరిగి ప్రయాణం అవుతున్నారని, చెన్నై సూపర్ కింగ్స్ బృందం సురేష్ రైనా కి, ఇంకా తన కుటుంబానికి సహకారాన్ని అందిస్తున్నాము” అని ట్వీట్ చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కొంతమందికి కరోనా సోకడం, అంతేకాకుండా సురేష్ రైనా కి రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా దొరకడం అనేది చాలా కష్టమైన విషయం కావడంతో ప్రస్తుతం బిసిసిఐ ఆందోళనలో ఉంది. కానీ సురేష్ రైనా ఇండియా కి వెనక్కి తిరిగి రావడానికి గల కారణం ఇది మాత్రమే కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం సురేష్ రైనా కి యాజమాన్యం ఇచ్చిన రూమ్ నచ్చలేదట. బయో బబుల్ ప్రోటోకాల్ పాటించడం కష్టం గా అనిపించిందట. మహేంద్ర సింగ్ ధోని కి ఇచ్చిన రూమ్ లాంటి రూమ్ కావాలి అని సురేష్ రైనా అనుకున్నారట. సురేష్ రైనా ఉండే రూమ్ కి బాల్కనీ సరిగా లేదట. అది కొంచెం ఇబ్బందిగా అనిపించిందట.
ఈ విషయంపై నచ్చచెప్పడంలో మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యారట. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో దాదాపు 13 మందికి (స్టాఫ్ సిబ్బంది తో కలిపి) కరోనా పాజిటివ్ రావడంతో మహేంద్ర సింగ్ ధోనీ భయం మరింత పెరిగింది అని సమాచారం.
దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ “క్రికెటర్లందరూ ప్రిమా డోనాస్ లాంటివారు. పాత కాలంలో ఉండే టెంపర్మెంటల్ యాక్టర్స్ లాగా అన్నమాట. నా ఆలోచన ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే, మీరు దేని వల్ల అయినా సంతోషంగా లేకపోతే, తిరిగి వెళ్లిపోండి. ఒక్కొక్కసారి విజయం తల పైకి ఎక్కుతుంది.
నేను మహేంద్ర సింగ్ ధోనీ తో మాట్లాడాను. ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగినా కూడా భయపడాల్సిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు. ప్లేయర్లందరితో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఈ సీజన్ ఇంకా ప్రారంభం అవ్వలేదు. అయినా తను ఏం కోల్పోతున్నారు అనే విషయం సురేష్ రైనా తెలుసుకుంటారు” అని అన్నారు.
End of Article