Ads
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ మొదలైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్ డే లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(124 బంతుల్లో 114), స్మిత్ (66బంతుల్లోనే 105పరుగులు), వార్నర్(76 బంతుల్లో 69), మాక్స్‌వెల్(19 బంతుల్లో 45) తో 50 ఓవర్లలో 374 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి కంగారూలు భారత ఆటగాళ్ళని కంగారు పెట్టారు. 375 భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు ఆది లోనే వరుస వికెట్ లు కోల్పోయారు. తర్వాత ధావన్, హార్దిక్ పాండ్య నిలకడగా ఆడటంతో కొద్దిగా గెలుపు ఆశలు చిగురించాయి. కానీ చివరికి వాళ్ళు కూడా అవుట్ అవ్వడంతో గెలుపు దూరమైంది.
Video Advertisement
ఇది ఇలా ఉండగా…ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో విఫలం అయ్యారు. అలాగే గ్లేన్ మాక్స్వెల్ పంజాబ్ జట్టుకి హ్యాండ్ ఇచ్చారు. రాజస్థాన్ జట్టులో స్మిత్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో ఐపీఎల్ లో హ్యాండ్ ఇచ్చిన ఈ ఆటగాళ్లు అందరు ఇండియా పై ఇలా విరుచుకుపడ్డారు ఏంటి అంటూ ట్రోల్ల్స్ ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అవి ఒక లుక్ వేయండి.
End of Article