Home serials ఇంక వంటలక్క పని అయిపోయినట్టేనా.? కార్తీకదీపం TRP ఎంత వచ్చిందంటే.?

ఇంక వంటలక్క పని అయిపోయినట్టేనా.? కార్తీకదీపం TRP ఎంత వచ్చిందంటే.?

by Mohana Priya

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీలోకి వస్తుంది. అందులో పాత్రలు మనకి తెలిసిన వాళ్ళు ఏమో అనిపిస్తుంది.

Karthika deepam serial director

అంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంత క్లోజ్ అయిపోయారు అని అర్థం. అయితే కొత్త సీరియల్ మధ్యలో కార్తీకదీపం హవా కొంచెం తగ్గింది అనే చెప్పాలి. ఇటీవల జానకి కలగనలేదు, గుప్పెడంత మనసు సీరియల్స్ ప్రారంభం అయ్యాయి. ఇవి రీమేక్ సీరియల్స్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉండటంతో ఈ సీరియల్స్ టాప్ లో దూసుకుపోతున్నాయి.

karthika deepam mounitha 1

అంతే కాకుండా కార్తీకదీపం సీరియల్ లో మోనిత ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుండి సీరియల్ బోరింగ్ గా అయ్యింది అని, సాగదీస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఎంత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా కూడా కార్తీకదీపం సీరియల్ మాత్రం ఇంకా టాప్ లోనే ఉంది.

premi vishwanath and suma advertisement

జూన్ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు చూస్తే కార్తీకదీపం సీరియల్ 19.10 రేటింగ్ సంపాదించింది. అలాగే 12 నుండి 18 తేదీల మధ్య 18.86 రేటింగ్ అలాగే 19 నుండి 25 మధ్య 18.25 రేటింగ్ సంపాదించింది. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ 18.24 సీరియల్ రేటింగ్ తో మొదటి స్థానంలో ఉండగా, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 12.92 రేటింగ్ తో రెండవ స్థానంలో ఉంది.

karthika deepam serial trp rating

అయితే ఇటీవల ప్రారంభమైన గుప్పెడంత మనసు సీరియల్ 11.89 రేటింగ్ తో 3వ స్థానంలో జానకి కలగనలేదు సీరియల్ 9.35 రేటింగ్ తో నాల్గవ స్థానంలో, దేవత సీరియల్ 8.79 రేటింగ్ తో ఐదవ స్థానంలో ఉంది. ఎన్ని కొత్త సీరియల్స్ వచ్చినా కానీ కార్తీకదీపం సీరియల్ మాత్రం మొదటి స్థానంలో అలాగే స్ట్రాంగ్ గా ఉంది.

You may also like