Home Sports Adda క్రికెటర్ శ్రీశాంత్ కి ఈ 7 మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయని మీకు తెలుసా.?

క్రికెటర్ శ్రీశాంత్ కి ఈ 7 మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయని మీకు తెలుసా.?

by Mohana Priya

ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్. పరిచయం అక్కర్లేని వ్యక్తి. శ్రీకాంత్ తన ఆటతీరుతో ఎంతో పేరుతెచ్చుకున్నారు. శ్రీశాంత్ వ్యక్తిగత విషయాల గురించి కూడా చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. శ్రీశాంత్ బిగ్ బాస్ హిందీ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. శ్రీశాంత్ గురించి వచ్చిన రూమర్స్ లో తన రిలేషన్ షిప్ మీద వచ్చిన రూమర్స్ కొన్ని ఉన్నాయి. వారిలో కొంత మంది మనకి తెలిసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం శ్రీశాంత్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు అని పుకార్లు వచ్చిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 శ్రీయ సరన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ సరన్ తో శ్రీశాంత్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు అంతకుముందు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ వాళ్లు వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అని చెప్పారు.

Actresses who rumoured to be in relationship with Sreesanth

#2 లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్ శ్రీశాంత్ ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అవి కేవలం సెట్ లో లక్ష్మీ రాయ్ ని కలిసినప్పుడు దిగిన ఫోటోలు మాత్రమే అని చెప్పారు.

Actresses who rumoured to be in relationship with Sreesanth

#3 రియాసేన్

బాలీవుడ్ నటి రియాసేన్ తో కూడా శ్రీశాంత్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

Actresses who rumoured to be in relationship with Sreesanth

#4 షాజన్ పదంసీ

హిందీతో పాటు తెలుగులో ఆరెంజ్, మసాలా సినిమాల్లో నటించిన షాజన్ పదంసీ కూడా శ్రీశాంత్ రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై షాజన్ పదంసీ స్పందిస్తూ వారిద్దరూ కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు.

Actresses who rumoured to be in relationship with Sreesanth

#5 సుర్వీన్ చావ్లా

సుర్వీన్ చావ్లా శ్రీశాంత్ కలిసి ఒక డాన్స్ షోలో పాల్గొన్నారు. అప్పుడు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి.

Actresses who rumoured to be in relationship with Sreesanth

#6 నికిషా పటేల్

కొమరం పులి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నికిషా పటేల్ తో కూడా శ్రీశాంత్ రిలేషన్ లో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి.

Actresses who rumoured to be in relationship with Sreesanth

#7 మినీషా లాంబా

మినీషా లాంబా, శ్రీశాంత్ ఒక ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో కలిశారని, ఆ తర్వాత వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి.

Actresses who rumoured to be in relationship with Sreesanth

You may also like