Ads
2003 లో జరిగినట్టే వరల్డ్ కప్ లో మరోసారి ఇప్పుడు జరిగింది. ఆస్ట్రేలియాతో చేతిలో ఫైనల్ లో ఓడిపోయింది భారత్. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన భారత్…నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలవుట్ అయ్యింది. విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు తప్ప మిగిలిన ప్లేయర్స్ అందరు చెప్పుకోదగ్గ స్కోర్ ఏం చేయలేదు.
Video Advertisement
ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు…47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా…6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 120 బాల్స్‌లో 137 రన్స్ చేసి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లబుషేన్ (58) హాఫ్ సెంచరీతో రాణించి హెడ్‌కు సహకారం అందించాడు. నాకౌట్ మ్యాచ్‌లంటే విజృభించే ఆస్ట్రేలియా జట్టుకి…టాస్ గెలవడం బాగా కలిసొచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ ని తక్కువ స్కోర్ కె పరిమితమయ్యేలా చేసారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి డ్యూ రావడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది.ఆ డ్యూ నే మన కొంపముంచింది.
ఇది ఇలా ఉంటే..ఈ మ్యాచ్ కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ “పాట్ కమిన్స్” మీడియా సమావేశంలో అన్న మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. “రేపు స్టేడియంలో క్రౌడ్ అంతా ఇండియా ఫాన్స్ తో వన్ సైడ్ ఉంటుంది. ఇండియా కి సపోర్ట్ చేస్తూ ఫాన్స్ చేసే అరుపులను నిశ్శబ్దంలోకి నెట్టగలిగితే, దానంత ఆనందం మరొకటి ఉండదు. ఫైనల్ మ్యాచ్ లో మా లక్ష్యం కూడా అదే.. అందుకోసం మేం ప్లాన్ ని కూడా సిద్ధం చేసుకున్నాం”. అన్నారు…ఇప్పుడు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లోనే రోహిత్, కోహ్లీ అవుట్ అవ్వగానే స్టేడియం అంతా సైలెంట్ అయ్యింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో హెడ్ చెలరేగిపోతుంది ఆడియన్స్ అంతా సైలెంట్ అయిపోయారు.
End of Article