అయ్యప్ప స్వామి వారి భక్తులు అయ్యప్ప మాల వేసుకుని ఎంతో నిష్టతో పూజలు చేస్తారు. 40 రోజుల పాటు కఠోర దీక్షతో నియమాలను పాటిస్తూ కొలుస్తారు. ఆ తర్వాత శబరిమల వెళ్లి మాలని తొలగిస్తారు. అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు. ఆయన ఆలయాల్లో కూడా భక్తులు విశేష పూజలతో పాటు అభిషేకాలు కూడా జరిపిస్తూ ఉంటారు. తాజాగా.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది.
కోయంబత్తూర్ లో స్థానికంగా ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామి వారికి అభిషేకం చేస్తున్న సమయంలో కళ్ళు తెరిచి మూసినట్లు భక్తులు గమనించారు.
ఈ సమయం లో తీసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మణికంఠ స్వామి ఆలయం లో ఇటీవల 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3 వేలకు మందికి పైగా భక్తులు ఈ పూజ కి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పూజారులు అభిషేకాన్ని నిర్వహించారు.
అభిషేకం జరుగుతున్న సమయంలోనే విగ్రహం కళ్ళు తెరవడం భక్తులు గమనించారు. దాదాపు నాలుగుసార్లు స్వామి కళ్ళు తెరుస్తూ.. మూస్తూ ఉండడం గమనించామని స్థానికంగా ఉన్న భక్తులు చెబుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో.. చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.
Watch Video:













































