మాటమాటకీ ఏడ్చే ఆడవాళ్లు ఎలాంటి వారో తెలుసా..? వారి గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

మాటమాటకీ ఏడ్చే ఆడవాళ్లు ఎలాంటి వారో తెలుసా..? వారి గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Anudeep

Ads

స్త్రీలని పువ్వులతోను, ప్రకృతి తోనూ పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు అంత సుకుమారంగా ఉంటారు కాబట్టి. అమ్మాయిలు ఎంత అందంగా నవ్వుతూ ఉంటారో.. అలానే బాధ కలిగినప్పుడు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా అబ్బాయిలు ఏడ్చినా కూడా అమ్మాయిలా ఏడుస్తున్నావ్ ఏంటి..? అని అడుగుతూ ఉంటారు.

Video Advertisement

అలా అమ్మాయిల జీవితంలో ఏడుపు కూడా ఒక భాగం అయిపొయింది. చాలా మంది అమ్మాయిలు పబ్లిక్ లో స్ట్రాంగ్ గానే ఉన్నట్లు కనిపించినా.. వారు ఒంటరిగా ఉన్న టైం లో ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంటారు.

women crying 1

కొందరు అమ్మాయిలు అయితే.. చుట్టూ ఎంత మంది ఉన్నా అదేమీ పట్టనట్లు వారికి బాధ వస్తే ఏడ్చేస్తారు. ప్రతి చిన్న విషయానికి వారికి ముందు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అయితే.. ఇలా మాట మాటకి ఏడ్చేవారిని చూస్తే అబ్బాయిలకు చిరాకు కలగడం సహజం. కానీ.. వారు ఇలా ఎందుకు ఏడుస్తారు..? వారు ఎలాంటి వారు అనేది తెలిస్తే.. ఇకపై ఎప్పుడు వారిపై చిరాకు కలగదు.

women crying 2

ఇటువంటి ఆడవారు ఎదుటి వారి కష్టాలకి చలిస్తారు. వారి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు అవడం వల్లే మాట మాటకి ఏడ్చేస్తూ ఉంటారు. ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనసు వీరిది. అవతలివారిని చాలా బాగా అర్ధం చేసుకుంటారు. తమకి బాధ కలిగినా.. ఎదుటివారిని మాత్రం బాధ పెట్టకుండా చూసుకుంటారు.

women crying 3

అయితే వీరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరితోనూ త్వరగా కలవలేకపోతుంటారు. తమకు ఎవరు లేరు.. తాము ఒంటరి అన్న భావన వీరిని వెంటాడుతూ ఉంటుంది. తమని చూసి నవ్వుకుంటున్నా.. వీరు తమ ఉద్వేగాలను దాచుకోలేరు. ఎవరైనా వీరిని బాధ పెడితే.. బాధతో ఏడుస్తారు తప్ప.. తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని.. వారిని సాధించాలని భావించరు. మీ స్నేహితుల్లో.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలాంటి ఆడవారు ఉంటె వారికి అండగా ఉండి భరోసాని ఇవ్వండి. ఆమె బాధని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి వారు కష్టాలను భరించాలని అనుకుంటారు తప్ప.. వదిలేసి వెళ్లాలని అనుకోరు. ఇలాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న వారు దొరకడం కూడా అదృష్టమే. వీరిని వదులుకోకండి. వారి భావోద్వేగాలను అర్ధం చేసుకుని.. వారి నుంచి మరింత ప్రేమని అందుకోండి.


End of Article

You may also like