నిన్న ఛార్మి పుట్టినరోజు సందర్భం గా పలువురు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆమె పూరి దర్శకత్వం లో ‘లైగర్’ సినిమా ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్నారు.

ఛార్మి పుట్టినరోజు సందర్భంగా రౌడీ అన్న ఛార్మి కి ప్రత్యేకం గా గిఫ్ట్స్ పంపించారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు ఛార్మి.. ఫుల్ లవ్..” అని ప్రెసెంట్ పై విజయ్ రాసారు. ఛార్మి కౌర్ కి చాలా గిఫ్ట్స్ నే పంపారు విజయ్. ఆ వీడియో ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో పంచుకున్నారు.
The #Liger @TheDeverakonda Special Birthday presents to his producer @Charmmeofficial ?@PuriConnects #PC #HBDCharmmekaur pic.twitter.com/UjmrFQJHmj
— 123telugu (@123telugu) May 17, 2021

























