మలయాళ చిత్రాలు కంటెంట్ బేస్డ్ చిత్రాలని చెప్పవచ్చు. సినిమాలో పేరు గాంచిన నటీనటులు లేనప్పటికీ, కథ పై ఆధారపడి తీసిన తక్కువ బడ్జెట్ చిత్రాలు అయినప్పటికి పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. వాటికి ఉదాహరణగా రోమంచమ్ సినిమాను చెప్పవచ్చు. 2 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా 69 కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
ఈ చిత్రం లాగే గత ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా కూడా 5 కోట్లు పెట్టి నిర్మించగా 50 కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతగా ఈ చిత్రం హిట్ అవడానికి ఈ చిత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం..
మలయాళ నటుడు మరియు నిర్మాత అయిన కుంచాకో బోబన్ నటించిన ‘నా తాన్ కేస్ కొడు’ అనే సినిమా 2022 లో ఆగస్ట్ 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గాను హిట్ గా నిలిచింది. 5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లను వసూల్ చేసింది. ఈ చిత్రం ఏనాట గా హిట్ అయ్యింది అంటే బాలీవుడ్ చిత్రాలైన అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల స్క్రీన్ కౌంట్‌ను తగ్గించి, ఆ థియేటర్లను ఈ చిత్రం మరిన్ని షోలను వేశారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతికే దొంగ కోజుమ్మల్ రాజీవ్ కూలీ పని చేసే తమిళ అమ్మాయి దేవిని ఇష్టపడతాడు. ఆమె కోసం దొంగతనాలు మానేసి, కూలీగా మారుతాడు. ఆమె ఇంట్లో కలిసి ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఒకరోజు గుడి లో జరిగే భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో ను నుండి తప్పించుకుందేనందుకు, పక్కనే ఉన్న ఇంటి గోడ దూకడంతో అక్కడి పెంపుడు కుక్కలు కరుస్తాయి.
వాటి అరుపులకు లేచిన ఇంట్లో వారు అతడి పై దొంగతనం ఆరోపణలు చేస్తారు. ఆ ఇల్లు ఎమ్మెల్యేది కావడంతో పోలీసులు వెనటనే అరెస్ట్ చేస్తారు. కేసు కొరత్కు వెళ్తుంది. కోర్టులో, రాజీవ్ తనకు తెలిసిన పోలీసుగా మారిన న్యాయవాది సహాయంతో తన కేసును తనే స్వయంగా వాదించి, సాక్ష్యాలను తెస్తానని వాగ్దానం చేస్తాడు. అతను సాక్ష్యాలను ఎలా సంపాదించాడు. కోర్టులో ఎలా నిర్దోషి అని నిరూపించుకున్నాడనేది మిగతా స్టోరీ.
ఈ చిత్రాన్ని దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ చెప్పాలను కున్న పాయింట్ ను చక్కగా, చాలా సహజంగా తెర పై చూపించాడు. కామెడీ సన్నివేశాలు, కుంచాకో బోబన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ గా గాయత్రీ శంకర్ నటించారు. డాన్ విన్సెంట్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు
Also Read: సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రిక చూసారా.? వివాహం ఎక్కడ జరిగింది అంటే.?



మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని సొంత ప్రొడక్షన్ హౌజ్ లో మమ్ముట్టి నిర్మించారు. ఈ యాక్షన్-మిస్టరీ థ్రిల్లర్ మూవీకి రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ డిమాండ్ మేరకు 25 కొత్త కేంద్రాలలో 70 అదనపు షోలను ప్రారంభించారు.
ఇక కథ విషయాని వస్తే, ఇక ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోవారిని హత్య చేసి, ఇంట్లోని నగలు డబ్బును కొందరు దోచుకుని వెళ్తారు. ఈ కేసును చేధించడానికి కన్నూర్ స్క్వాడ్ ను నియమిస్తారు. ఈ స్క్వాడ్ ఏఎస్ఐ జార్జ్(మమ్ముట్టి ) నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రత్యేక పోలీసుల దర్యాప్తు బృందం. ఏఎస్ఐ జార్జ్, అతని టీమ్ ఈ కేసును ఎలా చేధించారు అనేది మిగిలిన కథ.
సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. సినిమా కథనం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు, సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ చిత్రం సెకండాఫ్ శరవేగంగా సాగుతూ, ఆశ్చర్యం కలిగిస్తుంది. మమ్ముట్టి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. మమ్ముట్టి చెప్పే ‘మాస్’ డైలాగ్‌లు ఆడియెన్స్ ను అలరిస్తాయి.


బాబూరావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత ఏదైనా సాధించాలని హైదరాబాద్‌కు వచ్చారు. అయితే నగరానికి వచ్చిన తొలి రోజుల్లో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కూడా పడుకున్నాడు. మొదట్లో బట్టల షాప్ లో పనిచేశారు. కొన్ని చిన్న ఉద్యోగాలను చేశాడు. హోటల్ లో పనిచేస్తే కనీసం తినడానికి ఆహారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో కేఫ్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అలా కేఫ్‌లో క్లీనర్‌గా పనిచేయం ప్రారంభించిన బాబూరావు వెయిటర్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ తరువాత బిస్కెట్లు, టీ తయారు చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ 1978 నాటికి బాబురావు కేఫ్‌ను నడిపే స్థితి వచ్చాడు. కేఫ్ నడిపే కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, బాబూరావు కేఫ్ యాజమాన్యానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కష్టపడుతూ 1993 సంవత్సరం నాటికి కేఫ్‌ను సొంతం చేసుకోవడానికి అవసరం అయిన డబ్బును సంపాదించాడు. అప్పటి నుండి బాబూరావు ఓనర్ గా మారి, కేఫ్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. మూడు అవుట్లెట్ల యజమానిగా మారిన బాబూ రావు తన మూలాలను మర్చిపోలేదు.
ఈ కేఫ్ ద్వారా పేదవారికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ షాపులో మిగిలిన బిస్కెట్లను, బ్రెడ్లను పేద వారికి పంచుతుంటారు. ఆయన తండ్రి కోరిక మేరకు 25 ఏళ్ల నుంచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్ మరియు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న పేషంట్లకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు వందల మందికి అల్పాహారం, మూడు వందల మందికి భోజనం అందిస్తున్నారు.