టాలీవుడ్ లో రైటర్స్ కి కొదవ ఏమీ లేదు.. అయితే అందులో మంచి సక్సెస్ అందుకున్న వారు కొందరనే చెప్పాలి. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ గా పేరు పొందిన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్.
కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్ అలియాస్ కె.వి.వి. ప్రసాద్.. బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు లాంటి పలు సూపర్ డూపర్ చిత్రాలకు కథలు అందించారు. అయితే ఈయన రేంజ్ అమాంతం పెంచిన మూవీ మాత్రం బాహుబలి. ఈ మూవీ డైరెక్టర్ జక్కన్న స్వయంగా ఈయనకు కొడుకు.

జక్కన్న చిత్రాలతో విజయేంద్ర ప్రసాద్ ఇమేజ్ ..బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా స్టోరీస్ కోసం ఆయనను అడిగే అంత రేంజ్‌కి పెరిగింది. ప్రస్తుతం అందరూ అనుకుంటున్నాట్లు విజయేంద్ర ప్రసాద్ కేవలం రాజమౌళి చిత్రాలకు మాత్రమే స్టోరీస్ అందించడం లేదు. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ మూవీ సక్సెస్ తర్వాత మణికర్ణికాలాంటి మరో సూపర్ హిట్ చిత్రానికి ఆయన స్టోరీ అందించారు.
ప్రస్తుతం సీత ది ఇన్ కారినేషన్ అనే పాన్ ఇండియన్ రేంజ్ బాలీవుడ్ మూవీ కి స్టోరీ అందించే పనిలో బిజీగా ఉన్నారు. వీటితోపాటు సూపర్ స్టార్ మహేష్, జక్కన్న కాంబోలో రాబోతున్న మూవీకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. రైటర్లకు స్టార్ హీరోల రేంజ్ పారితోషకం అందడం చాలా అరుదు. వందల కోట్లు వసూలు చేసే సినిమా రాసి రైటర్ కు వచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం రైటర్ గా కథ అందివ్వడం కోసం అక్షరాల ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రైటర్ గా అత్యధిక పారితోషకం అందుకుంటున్న వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ముందు ముందు ఈ రెమ్యూనరేషన్ మరింత పెరిగే ఆస్కారం కూడా ఉంది.





ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలలకే ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు వేగంగా జరిగాయి. ముందు తాత్కాలికమైన సచివాలయం, శాసనసభ రెడీ చేసి, 2017 నుండి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. ఇందులో 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వాటితో పాటు శాశ్వత వసతి కోసం పలు బిల్డింగ్స్ నిర్మించడానికి పనులు కూడా మొదలయ్యాయి. అందులో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఎనబై శాతం పనులు పూర్తయ్యాయి.
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో వెచ్చించారు. అయితే రోడ్లు, భవనాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అమరావతి నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా వెచ్చించాయి. దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని అమరావతి జేఏసీ హైకోర్టుకు తెలిపింది. అమరావతి కోసం కేంద్రం ఇప్పటి వరకూ దాదాపుగా రూ. 1500 కోట్లు రిలీజ్ చేసింది.
“2021 నవంబర్ 23 లెక్కల ప్రకారంగా, అమరావతి అభివృద్ధి కోసం రూ. 8,572 కోట్లు వెచ్చించారు. అందులో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు, 3 వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కౌలు చెల్లింపు, కన్సల్టెన్సీ చార్జీలు,పెన్షన్ల నిమిత్తం ఖర్చయ్యాయి. ఈ నిధులు అమరావతి బాండ్లు, హడ్కో లోన్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వీటికి వడ్డీల చెల్లించే భారం తమ ప్రభుత్వం భరిస్తోంది” అని ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
కల్యాణి ప్రియదర్శన్ తెలుగు మూవీ ‘హలో’ తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ చిత్రానికి గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ అవార్డును అందుకుంది. ఆ తరువాత చిత్రాలహరి, రణరంగం సినిమాలతో అలరించారు. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ‘శేషమ్ మైక్ – ఇల్ ఫాతిమా’ మలయాళ మూవీ నవంబర్ 17న విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 16 నుండి ‘నెట్ ఫ్లిక్స్’లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మూవీ కథ విషయానికి వస్తే, ఫాతిమా (కళ్యాణి ప్రియదర్శన్) చిన్నతనం నుండి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మునీర్ (సుధేశ్), తల్లి (ప్రియా శ్రీజిత్), అన్నయ్య ఆసిఫ్ (అనీష్) ఉంటారు. తండ్రి అన్నయ్య మెకానిక్ షెడ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. మునీర్ కుటుంబ పరువు ముఖ్యంగా భావిస్తూ ఉంటాడు. ఫాతిమాకు ఆసిఫ్ సపోర్ట్ చేస్తుంటాడు. ఫుట్‌బాల్ చూస్తూ, అర్థం చేసుకుంటూ పెరిగిన ఫాతిమా ఎక్కడున్నా కబుర్లు చెప్పే అలవాటు ఉంటుంది.
కాలేజ్ లో చదివేటప్పుడు ఫుట్ బాల్ టోర్నమెంట్స్ కి ఫాతిమా కామెంటేటర్ గా చేయడంతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆమె ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా వృత్తిని కొనసాగించాలని డిసైడ్ అవుతుంది. కానీ ఫాతిమా జనాల్లోకి వెళ్లడం వల్ల వారి కుల పెద్దల నుండి విమర్శలు వస్తాయి. దాంతో మునీర్ ఫాతిమాకి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఫాతిమా మాత్రం అనుకున్నది సాధించిన తరువాతే పెళ్లి చేసుకుంటానని, కొచ్చికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఫాతిమా అనుకున్నది సాధిస్తుందా? అనేది మిగిలిన కథ.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ చిత్రం బ్రో డాడీ. ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాని రాజకీయ నేపథ్యంలో తీసిన, పృథ్వీరాజ్ ఈ మూవీని కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాడు. ఈ మూవీ 2022 లో జనవరి 26న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, జాన్ కట్టాడి (మోహన్‌లాల్), అన్నమ్మ(మీనా) ల కుమారుడు యేషూ (పృథ్వీరాజ్ సుకుమారన్). యేషూ బెంగళూర్ లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. అతను కురియన్ (లాలు అలెక్స్), ఎల్సీ కురియన్ (కనిహ) ల కూతురు అన్నా (కళ్యాణి ప్రియదర్శన్)ను ప్రేమిస్తాడు. అన్నా కూడా యేషూని లవ్ చేస్తుంది. జాన్, కురియన్ లు మంచి ఫ్రెండ్స్. వారి భార్యలు తమ పిల్లలకు పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తారు. అయితే అప్పటికే బెంగళూరులో యేషూ, అన్నాలు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తుంటారు. ఈ విషయం పెద్దలకు తెలియదు. యేషూ మరియు అన్నా వారి బంధం గురించి తల్లిదండ్రులకు చెప్పాలని ఆలోచిస్తుంటారు.
ఈలోగా అన్నా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో యేషూ షాక్ అవుతాడు. అదే టైమ్ లో అర్జంట్ గా రమ్మని జాన్ నుండి కాల్ వస్తుంది. వెంటనే బయలు దేరి తండ్రి దగ్గరికి వెల్లున యేషూకు జాన్ అతని తల్లి ప్రెగ్నెంట్ అనే షాకింగ్ వార్తను జాన్, అన్నమ్మలు చెబుతారు. విషయం తెలిసిన యేషూ ఎలా రియాక్ట్ అయ్యాడు? అన్నా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని జాన్, అన్నమ్మలకు ఎలా చెప్పాడు? అది విన్న వారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఈ మలయాళ స్టార్ హీరోలు ఇద్దరు తండ్రీకొడుకులుగా నటించడం ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
