సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ పోస్టర్స్, టీజర్‌తో అంచనాలను క్రియేట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాల’ కు ప్రేక్షకులను రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను వేగిరం చేసింది. ఈ క్రమంలో సెకండ్ సింగిల్ గా ‘ఓ మై బేబీ’ పాటని రిలీజ్ చేశారు. అయితే ఈ పాట పై నెట్టింట్లో ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్ పై పాట రచయిత, నిర్మాత నాగవంశీ ఫైర్ అయ్యారు. అయితే దీనిపై మహేష్ బాబు సారీ చెప్పారంటూ ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘ఓ మై బేబీ’ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి గుంటూరు కారం యూనిట్ మీద మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం దానిపై పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వార్ మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ చేసారు. ఈ ట్రోలింగ్ పై నిర్మాత నాగవంశీ రెస్పాండ్ కావడం మరింత హాట్ టాపిక్ కి దారి తీసింది. ఆ తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. ఇలా ఇద్దరు వెనక్కి తగ్గడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు క్షమాపణ చెప్పడమే అంటూ ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఆ పోస్ట్ లో “నాగవంశీ తన ట్వీట్లను తొలగించాడు. అతను ఫ్యాన్స్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేశాడు. మహేష్‌బాబు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ పై సోషల్ మీడియాలో ఉపయోగించిన భాషతో అప్ సెట్ అయ్యాడు. అది చాలా తప్పు అనేలా చెప్పారు. మహేష్ అన్నకి తన ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది అర్దమైందా? వర్క్ తో మాట్లాడదాము, ఇంప్రెస్ చేద్దాము. వాళ్ళు చెప్పారు అంటే వూరికే చెప్పరు. ఏదైనా అని ఉంటే నా తరుపున క్షమించండి, రామజోగయ్య గారు, తిరిగి వర్క్ కు రండి. నెక్ట్స్ పాట అదిరిపోయేలా రాయండి అనేలా చెప్పారంట.
ప్రొడక్షన్ హౌస్ మరియు నిర్మాతలు తెలుసుకోవలసిన విషయం, ఎండ్ ఆఫ్ ద డే అభిమానులే అంతా, వాళ్లకోసమే సినిమాలు తీసేది అనే స్టేట్మెంట్ ఉంటుంది ఏ హీరో నుండి అయినా, అట్లాంటిది వారిని జడ్జ్ చేయవద్దు. మీ చెత్త ప్రవర్తన వల్ల మా హీరో మాకు సారీ ఫిల్ అవడం మాకు ఇష్టం ఉండదు. మా అన్నయ సినిమా అండి.సెలెబ్రేషన్స్ మేము చేసుకుంటాము అంటే అర్ధం, సెలెబ్రేషన్స్ చేసేలా సాంగ్స్ ఇవ్వాలి అని, బలవంతంగా రుద్దడం కాదు. ఓవర్ ఆల్ గా ఇక్కడితో పంచాయితీ అయిపొయింది. అదిరిపోయే కంటెంట్ మీరు మాకు ఇవండి. దాన్ని నెక్స్ట్ లెవల్ సెలెబ్రేషన్స్ మేము చూసుకుంటాము” అని చెప్పుకొచ్చారు.
Also Read: “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!

భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరియు రోహిత్ శర్మ 2008లో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ షూట్‌కు యువరాజ్ మేనేజర్ రితికా సజ్దే కూడా వచ్చారు. రీతికను యువరాజ్ సోదరిగా భావిస్తాడు. అందువల్ల రోహిత్ షూట్ కోసం రాగానే రితికను చూపిస్తూ, ఆమె స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ అని, ఆమెకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన రోహిత్ ఆమెతో నాకేం పని? ఇక్కడికి షూటింగ్లో పాల్గొనడానికి వచ్చానని స్ట్రాంగ్ గా చెప్పాడు. అయితే మరోసారి షూట్ లో కలిసినపుడు రితిక ప్రవర్తించిన విధానానికి రోహిత్ ఫ్లాట్ అయ్యాడు.
అలా వారిద్దరి మధ్య మాటలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత రోహిత్ శర్మకు రితిక మేనేజర్ అయ్యింది. ఇలా మొదలైన వారి ప్రయాణం, ప్రేమ, డేటింగ్ వరకు సాగి, పెద్దల అంగీకారంతో 2015లో జూన్ 3న కుటుంబ సభ్యుల సమక్షంలో రోహిత్, రితిక ల ఎంగేజ్మెంట్ జరుగగా, డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లికి ముందు డేటింగ్ చేసిన విషయాన్ని ఇద్దరు చాలా రహస్యంగా ఉంచారు. వీరిద్దరూ తమ వివాహ బంధానికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తమ ప్రేమను తెలుపుతూ సోషల్ మీడియాలో అందమైన ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ జంటకి 2018లో డిసెంబరు 30న కుమార్తె జన్మించింది.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, శక్తికపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలక పాత్రలలో నటించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధిచింది. రూ. 760 కోట్ల పైగా సాధించి, పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీలో నటించిన త్రిప్తి దిమ్రి లాంటివారికి మంచి గుర్తింపు లభించింది. ఆమె ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నర్స్ పాత్రలో హిందీ సీరియల్ నటి దీప్తి పాటిల్ నటించారు.
దీప్తి పాటిల్ ముంబైలో పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె యాక్టింగ్ కెరీర్ 2018లో పాపులర్ స్టార్ ప్లస్ షో అయిన “యే హై మొహబ్బతేన్” తో ప్రారంభం అయ్యింది. ఆ షోతో బ్రేక్ రావడంతో అవకాశాలు వచ్చాయి. అలా రామన్ అకా కరణ్ పటేల్ యొక్క నర్సుగా. ఆమె సుమారు 20 ఎపిసోడ్లలో నటించింది. “యే రిష్టే హై ప్యార్ కే” ద్వారా గుర్తింపును తెచ్చుకుంది.
ఆ తరువాత దీప్తి పాటిల్ పలు పౌరాణిక మరియు క్రైమ్ షోలలో నటించింది. అలా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి పాటిల్ డైరెక్టర్ సందీప్ వంగా యనిమాల్ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక ఇంట్లో ఉండే నర్స్ క్యారెక్టర్ కు తీసుకున్నారు. ఈ మూవీతో ఆమె పాపులర్ అయ్యారు. దీప్తి పాటిల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తరచూ తనకు సంబడనహించి ఫోటోలు, రీల్స్ ను షేర్ చేస్తుంటారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 36 k కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
1. ప్రభాస్:
2. విక్టరీ వెంకటేష్:
3. సూర్య:
4. అజిత్:
5. విక్రమ్:
6. జయం రవి:
7. దళపతి విజయ్:
ఈ జంట కోలీవుడ్ హిట్ పెయిర్స్ లో ఒకరిగా నిలిచారు. త్రిష, విజయ్ నటించిన సినిమాలు గిల్లి, కురువి, తిరుపాచి. ఆది మరియు లియో.
ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024కు ముందు కెప్టెన్ మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్ళ నుండి జట్టును నడిపించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. అత్యంత విజయవంతమైన టీమ్ గా ఐపీఎల్లో కొనసాగుతున్న, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా ముంబయి ఇండియన్స్‌కు చాలా పేరుంది. ఈ జట్టుకు 2013లో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్ లో కప్ ను అందించిన రోహిత్, పదేళ్లుగా ఆ జట్టుకు ఎన్నో విజయాలు సాధించాడు.
ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. జట్టు పై కెప్టెన్‌గా, ఫ్యాన్స్ పై తనదైన ముద్రను వేశాడు. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్‌గా లేని ముంబై జట్టును ఊహించుకోవడం ఫ్యాన్స్ మింగుడుపడడం లేదు. అలా చేయడం చాలామందికి షాక్ కి, ఆగ్రహానికి గురి చేసింది. రోహిత్ ను తప్పించడం పై సోషల్ మీడియాలో ముంబై జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం పై తాజాగా గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే రెస్పాండ్ అయ్యారు.
2024 సీజన్ నుండి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నట్లు జయవర్ధనే వెల్లడించారు. ‘ఎప్పుడైనా ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే జట్టు నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటిదే ఈ డిసిషన్, రోహిత్ మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్, హర్భజన్, పాంటింగ్ లు టీమ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించడమే కాకుండా ముందుచూపుతో కూడా నడుచుకున్నారని అన్నారు. ఇక రోహిత్ శర్మ సారధ్యంలో జట్టు అత్యుత్తమ ఫలితాలను అందుకుంది. అతని కెప్టెన్సీకి అభినందనలు. ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్లలో ఒకరైన రోహిత్ ఎక్స్పీరియన్స్ టీమ్ కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అంటూ జయవర్ధనే పేర్కొన్నాడు.
ఈమె ఒక బ్రాహ్మణ ఫ్యామిలిలో జన్మించింది. ఆమె తండ్రి దీపనాథ్ సేన్, తల్లి బెంగాలీ నటి సుచిత్రా సేన్. ఈమె షిల్లాంగ్ లోని లోరెటో కాన్వెంట్లో, కోల్‌కాతాలోని లోరెటో హౌస్‌లో చదువుకుంది. చిన్నప్పటి నుండి తల్లి సుచిత్రా సేన్ తో కలిసి సినిమా షూటింగ్ లకు వెళ్లడంతో ఆమెకు నటన పై ఆసక్తి కలిగింది. ఆమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె పెళ్లి, పిల్లలు అయిన తరువాత సినిమాలలో యాక్టింగ్ ప్రారంభించింది.
మూన్ మూన్ సేన్ నటిగా మారక ముందు మోడల్‌గా చేశారు. ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించి అనేక వివాదాలకు కారణమైంది. 1984లో ఆమె అనిల్ కపూర్ నటించిన ‘ఆనంద్ బహర్’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీకి ముందు ఆమె అనేక బెంగాలీ సినిమాలలో నటించింది. అప్పటికే తల్లి అయిన ఆమె ఎక్కువగా గ్లామర్ పాత్రలలో నటించడం వల్ల , ఒక వర్గం ఆడియెన్స్ మరియు సినీ క్రిటిక్స్ నుండి విమర్శలకు గురి అయ్యింది. హిందీలో అగ్ర నటులతో నటించింది.
ఆమె 1986లో సిరివెన్నెల చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో హీరోకు తన కళ్లను దానం చేసే జ్యోతిర్మయి పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆ మూవీకి నంది అవార్డ్ కూడా అందుకుంది. ఆ తరువాత, 1987లో అక్కినేని నాగార్జునతో మజ్ను సినిమాలో నటించింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆమె ఎన్ని భాషలలొ నటించిన బెంగాలీ చిత్రాలలో కొనసాగారు. ఆమె చివరిగా 2019 రిలీజ్ అయిన ‘భోబిష్యోటర్ భుట్’ అనే చిత్రంలో కనిపించింది. మూన్ మూన్ సేన్ ఇద్దరు కుమార్తెలు రైమా సేన్, రియా సేన్ లు యాక్టింగ్ నే కెరీర్ గా ఎంచుకున్నారు.


వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే అండర్ – 19 పురుషుల వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బపోటీ పడనుంది. ఈ జట్టుకు అండర్ – 19 ఆసియాకప్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఉదయ్ సహరన్ వరల్డ్ కప్‌లో కూడా కెప్టెన్సీ అప్పజెప్పింది. పదిహేనుమంది ఆటగాళ్లతో కూడిన ఈ టీమ్ లో అండర్ – 19 ఆసియాకప్ ప్లేయర్స్ కే అవకాశం ఇచ్చారు. అర్షిన్ కులకర్ణి, రుద్ర మయూర్ పటేల్, ఆదర్శ సింగ్, సచిన్ దాస్ బ్యాటింగ్ చేయనున్నారు.
ఇక జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన అరవెల్లి అవనీష్ రావును వికెట్ కీపర్‌గా సెలెక్ట్ అయ్యాడు. అవనీష్ రావు తెలంగాణలోని సిరిసిల్లా జిల్లా, పోత్గల్ గ్రామానికి చెందిన క్రికెటర్. అతను వెలమ వర్గానికి చెందినవాడు. పోత్గల్, దాని చుట్టుపక్కల గ్రామాలలో అధిక శాతం ఆ వర్గానికి చెందినవారు ఉంటారు. అయితే ఆ వర్గం వారిలో ఎక్కువగా రాజకీయ, లేదా వ్యాపార రంగాల వైపుకు వెళ్తారనే టాక్ ఉంది.
కానీ అవనీష్ రావుకు చిన్నప్పటి నుండి క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. క్రికెట్ లో ప్రతిభ కనపరిచిన అవనీష్ ను అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. సిరిసిల్ల వంటి ప్రాంతం నుంచి జాతీయ జట్టుకు ఎంపికవ్వడంతో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అవనీష్ తల్లిదండ్రుల పైన నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారతదేశంలో ఉన్న జీవనదుల్లో ప్రధానమైన నది గంగా నది. హిందువులు గంగానదిని చాలా పవిత్రంగా పూజిస్తారు. హిందువుల మతపరమైన విశ్వాసాలకు మరియు స్వచ్ఛతకు గంగానది ముఖ్యమైన సూచిక. వేద కాలం నుండి పవిత్రమైన, మతపరమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని ఉపయోగిస్తున్నారు. గంగా జలాన్ని సేవిస్తే పాపాలు చేసిన వారికి సైతం మోక్షం కలుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించినవారికి గంగాజలాన్ని తులసితో కలిపి తాగిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నుండి గంగాజలాన్ని సేవిస్తారు.
అగ్ని పురాణంలో 110 అధ్యాయంలో గంగా నది మహత్యాన్ని అగ్నిదేవుడే స్వయంగా వివరించాడని చెబుతారు. అగ్ని పురాణంలో చెప్పిన ప్రకారం, ఎల్లప్పుడు గంగను సేవిస్తూ ఉండాలట. గంగానది భుక్తి ముక్తి ప్రదాయని. భుక్తి ఇస్తుంది, ముక్తిని కూడా ఇస్తుంది. అంటే ఈ జన్మలో ఎంతో పుణ్యఫలాన్నీ అందిస్తుంది. మరణానంతరం కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. ఏయే ప్రాంతాల నుండి గంగ ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ పావనాలే అని అగ్నిదేవుడు చెప్పాడు.
దివ్యాంగులు గంగానది స్నానం చేస్తే వారు దేవతలతో సమానంగా భాసిల్లుతారట. గంగానది సేవించిన వారి మాతృ వంశం మరియు పితృ వంశం కూడా తరింపబడతాయి. ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆ వ్యక్తి దహన సంస్కారాలు పూర్తి చేసిన తరువాత అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు. ఒక వ్యక్తి అస్థికలు గంగానదిలో ఉన్నంతవరకు ఆ జీవి స్వర్గం లోనే నివసిస్తారని అగ్ని పురాణంలో చెప్పబడింది. అందుకోసమే గంగానదిలో అస్థికలు కలుపుతారు.