స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. మొన్నటి వరకు మయో సైటీస్ అనే వ్యాధితో బాధపడిన సమంత ఒక సంవత్సరం పాటు రెస్ట్ తీసుకుని ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఎప్పుడు తన సినిమాలకు సంబంధించిన పోస్ట్ లు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
బిజినెస్ లో కూడా సమంత రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ లోకి సమంత ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తుంది. ట్రాలల అనే బ్యానర్‌ను స్థాపించి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నట్లుగా సమంత తెలియజేశారు. వీటిలో ఎక్కువ శాతం మంది తెలుగువారికి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు.

అయితే ఇప్పుడు సమంత బ్యానర్ లో తెలుగు అమ్మాయికి ఛాన్స్ దక్కిందనే వార్త వినిపిస్తుంది. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్యకి బేబీ తర్వాత మంచి ఆఫర్లు ఏమీ రాలేదు. మళ్లీ బేబీ మూవీ కాంబినేషన్ లోనే ఇంకో సినిమా చేస్తున్నారు. రామ్ పూరి జగన్నాధ్ ల డబల్ స్మార్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారనే వార్త కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు సమంత నిర్మించబోయే సినిమాలో వైష్ణవి చైతన్య ఛాన్స్ దక్కించుకున్నారని తెలుస్తుంది. ఈ మూవీ తోనైనా వైష్ణవి చైతన్య ఫేట్ మారుతుందేమో చూడాలి

ఐపీఎల్ 2008లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ వేలంలో ఎంఎస్ ధోనీ అత్యధిక రేటు పలికిన ప్లేయర్ గా నిలిచాడు. ఆ సమయంలో ధోనీ దాదాపు ఆరు కోట్ల ధర పలికాడు. ధోనీని సొంతం చేసుకోవడం కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) లు తీవ్రంగా పోటీపడ్డాయి.
కొన్ని పరిస్థితుల వల్ల ఆర్సీబీ ధోనీని దక్కించుకోలేకపోయిందని అప్పటి వేలంపాటదారుడు రిచర్డ్ మాడ్లీ తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ఆ సమయానికి ఆర్సీబీ తమ ఫ్రాంచైజీ పేరును ఫిక్స్ చేసుకోలేదు. అందువల్ల బెంగళూరు పేరిట వేలంలో పాల్గొంది. బిడ్డింగ్ రూల్స్ కారణంగా ధోనీని సొంతం చేసుకునే విషయంలో ఆ జట్టు వెన్నక్కి తగ్గాల్సి వచ్చింది’ అని మాడ్లీ పేర్కొన్నాడు.
రూల్ ప్రకారం, జట్టు ఐకాన్ ప్లేయర్ కన్నా ఎక్కువ ఫీజు వేరే ప్లేయర్ కి ఉండకూడదు. ఆ జట్టు రాహుల్ ద్రవిడ్‌ను అప్పటికే టీమ్ ఐకానిక్ ప్లేయర్‌గా సెలెక్ట్ చేసుకుంది. అందువల్ల అత్యధిక ధర పలికిన ధోనీని జట్టులోకి తీసుకోలేకపోయింది. ముంబై ఇండియన్స్ సైతం ఈ కారణం వల్లే ధోనీని దక్కించుకోలేకపోయింది. ఆ జట్టు అప్పటికే సచిన్ టెండూల్కర్‌ను ఐకానిక్ ప్లేయర్‌గా తీసుకుంది.














