హనుమంతుడిని హిందువులు ఎంతో పవిత్రమైన దేవుడిగా ఆరాధిస్తారు.ప్రతి మంగళ, శనివారాలలో అంజనీ పుత్రునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే హనుమాన్ జయంతిని హిందువులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. అయితే ఒక సంవత్సరంలో హనుమాన్ జయంతి ని రెండు సార్లు జరుపుకుంటారు. ఇలా రెండు సార్లు జరుపుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాదేవి ఆచూకీ కోసం హనుమంతుడు వెతుకుతున్న నేపద్యంలో హనుమంతుడు మంగళవారం తెల్లవారుజామున లంకలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు.
ఆ రోజున చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి . ఆరోజున హనుమంతుడు అశోక నగరాన్ని నాశనం చేయడమే కాకుండా రావణ సైనికులను హతమారుస్తాడు. అలాగే తన తోకతో సగం లంకను దహనం చేస్తాడు. ఆరోజున హనుమంతుని విజయంగా జరుపుకోవాల్సిన రోజని తెలియని వారు ఆ రోజున హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్ లో వస్తుంది. నిజానికి హనుమంతుడి జయంతి వైశాఖ మాసం శుక్ల దశమి రోజున అసలైన జయంతి వేడుకలు నిర్వహించాలి.
ఆరోజు సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరి లో వస్తుంది పూర్వభద్ర పాద నక్షత్రం లో చంద్రుడితో పాటు జన్మించాడు. పరాశరసహిత ప్రకారం ఆ రోజే అసలైన హనుమంతుడి జయంతి. ఇది హనుమంతుడి పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అదీ మే చివరి వారంలో హనుమంతుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి.









హీరోయిన్ రష్మిక మందన్నలా కనిపిస్తున్న ఆ సెలబ్రిటీ పేరు సనా మీర్. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్‌గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది.
ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడింది. అందులో 137 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉంది. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఆమె 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్‌కు రెండు బంగారు పతకాలను సాధించింది. ఆమె 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. ఆమె 2009-2017 వరకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా సారధ్యం వహించింది.
సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్‌ల కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ ను ఇష్టపడుతారు.







