బిగ్‌బాస్ ఏడో సీజన్ హాట్ హాట్‌గా నడుస్తోంది. ప్రారంభమయి రెండువారాలు అయిన బిగ్‌బాస్‌లో ఇప్పటికీ కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యారు.
అయితే ఇంతకు ముందు బిగ్బాస్లా చూడటానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదని చాలామంది అంటున్నారు.

ఈ షో మీద బాగా నెగిటివిటీ ఉన్నప్పటికీ.. షో మాత్రం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ఇక శనివారం వచ్చిందంటే చాలు.. ఈసారి ఎవరూ ఎలిమినేట్ అవుతారని చాలామంది ముందే అంచనా వేస్తుంటారు. సాధారణంగా ఓటింగ్‌లో ఎవరు లీస్ట్‌లో ఉంటే వాళ్లే ఎలిమినేట్ అవుతారు.

ఈ వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు. వాళ్లు దామిని, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్. అయితే వీళ్లలో అమర్ దీప్‌కి ఓటింగ్స్ ఎక్కువ వచ్చాయి.
ఇతను టాప్‌లో ఉండగా.. దామిని ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉంది. ఓటింగ్స్ ప్రకారం జరిగితే ఈ వారం దామిని ఎలిమినేట్ అయినట్లేనని వార్తలు వస్తున్నాయి. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే సండే వరకు వేచిచూడాల్సిందే.


కానీ విన్నర్ ఎవరనేది ముందే ప్లానింగ్ చేసి ఉంటాదని చాలామంది నమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం వరకు ఉన్న ఆటను బట్టి విన్నర్ ఎవరంటే ఎక్కువగా శివాజీ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పటికీ శివాజీ బాగా ఆడుతున్నాడని నెటిజన్లు అంటున్నారు. శివాజీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేవరకూ కూడా తనపై చాలా నెగిటివిటీ ఉంది.
గుడిలో దేవుడి సన్నిధికి భక్తితో, స్కూల్ కు శ్రద్దాసక్తులతోనూ వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేవుడు అంటే పాపభీతి లేదు. చదువు నేర్పే గురువులకు గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు వినాయక చవితి వేడుకలను జరుపుకుంటూ, భక్తితో పూజలు చేస్తుంటే, మరో వైపు మండపాల వద్ద ఏమాత్రం ఆలోచన లేకుండా కొందరు దొంగతనాలు చేస్తుంటే మరికొందరు వెకిలి వేషాలు వేస్తున్నారు.
మియాపూర్‌లో రెండు రోజుల కిందట ఒక గణపతి మండపంలో దేవుడికి కూడా భయపడకుండా ఒక వ్యక్తి గణపతి చేతిలోని లడ్డును దొంగిలించడం తెలిసిందే. తాజాగా మేడ్చల్ లోని రాఘవేంద్రనగర్ కాలనీలో గణేష్ మండపంలో నిద్రిస్తున్న యువకుల వద్దకి వచ్చిన ఒక దొంగ, అర్ధరాత్రి 1: 50 నిమిషాలకు మండపలోకి వచ్చి, పడుకున్నవారి తల దగ్గర పెట్టుకున్న సెల్ ఫోన్లను సైలెంట్‌గా తీసుకున్నాడు. వారిలో ఒకరు కదులుతున్నా, కొంచెం కూడా భయపడకుండా మెల్లగా సెల్ ఫోన్లను తీసుకుని పారిపోయాడు.
అలికిడికి లేచిన ఒక యువకుడు చూసేసరికి, దొంగ పరారయ్యాడు. మిగతా ఫ్రెండ్స్ ను కూడా లేపి, దొంగ కోసం వెతికారు. అప్పటికే పారిపోయిన దొంగ దొరకలేదు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
నిత్యామీనన్ నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్ కలిసి నిర్మించాయి. ఈ సిరీస్ కు గోమఠేష్ ఉపాధ్యాయ డైరెక్షన్ చేయగా, యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ఈ సిరీస్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. దీనిని తెలుగులోనే కాకుండా తమిళ్, మళయాల, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో నిత్యామీనన్, గౌతమితో పాటు ఒక సీనియర్ నటి కనిపించారు. ఆమె ఎవరో కాదు తాళ్లూరి రామేశ్వరి. తెలుగు, హిందీ, ఒడియా, మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించి, ఆకట్టుకున్నారు. రామేశ్వరి 1977లో మొదటిసారి ‘దుల్హన్ వహీ జో పియా మాన్ భాయే’ మూవీలో నటించింది. ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పెద్ద బ్రేక్ వచ్చింది. వరుస అవకాశాలు వచ్చాయి.
తెలుగులో 1978 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సీతామాలక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ నటించింది. ఈ మూవీకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అందుకుంది. వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యింది. రీ ఎంట్రీలో మహేష్ బాబు హీరోగా నటించి నిజం మూవీలో తల్లిగా నటించింది. ఆ తరువాత పలు సీరియల్స్ నటించింది. తాజాగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ నానమ్మగా కనిపించింది.

రీసెంట్ గా “జవాన్” డైరెక్టర్ అట్లీ తన సినిమాని ఆస్కార్ కి పంపిస్తానని చెప్పగా, నెటిజెన్లు ఆయనను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ చేశారు. పాత మసాలా చిత్రాలన్ని కలిపి కలగూరగంపలా, తీసిన మూవీని ఆస్కార్ కి పంపి ఏం మెసేజ్ ఇస్తారని నెటిజెన్లు గట్టిగా తలంటారు. ఆ ట్రోలింగ్ ఆపకముందే మరో రెండు సినిమాలను ఆస్కార్ కు పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
వివాదాస్పద మూవీగా నిలిచిన ది కేరళ స్టోరీని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ రేస్ లో నిలిపేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ మూవీలో అదా శర్మ కీలక పాత్ర చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో అదా శర్మ సంతోషంతో తాను నటించిన మూవీని ఆస్కార్ కు పంపాలని అనుకుంటున్నారని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై నెటిజన్లు కౌంటర్లు కూడా వేస్తున్నారు.
మరో సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, ఈ మూవీని కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఈ మూవీని కూడా ఆస్కార్ కు పంపించాలని అనుకుంటునట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, అలియా ఓవర్ యాక్షన్ చేశారని, ఇలాంటి మూవీని ఆస్కార్ పంపిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి అయిన మహిళలు పూజలు, వ్రతాలు చేస్తూ, దేవుడిని కొలుస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయిన స్త్రీలు భర్తను కోల్పోయిన తరువాత వారిని శుభకార్యాలకు, పూజలకు దూరంగా ఉండాలని కొందరు అంటుంటారు. వితంతువులు పూజలు, వ్రతాలకు దూరంగా ఉంటారు. అయితే శాస్త్ర ప్రకారం, భర్తలేని మహిళలు పూజలు చేయకూడదు అనేది ఎక్కడా లేదు. భగవంతుడి పూజాకు ఎలాంటి తప్పు లేదా దోషం లేదని పండితులు చెబుతున్నారు.
అయితే పసుపు కుంకుమలు ఇవ్వడం, కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చునే పూజలు తప్ప మిగతా పూజలకు, దేవుడిని పూజించడానికి ఎలాంటి తప్పు లేదు. కార్తీక పురాణంలో ఒక స్త్రీ భర్త, తండ్రి మరణించిన తరువాత కార్తీక వ్రతం చేసుకుందని, కార్తీక స్నానం చేసిందని, ఏకాదశి వ్రతం చేసిందని, విష్ణు పూజ చేసిందని, ఆ తరువాత కావేరీ నది స్నానం చేస్తుదాగానే మరణించి, మరుసటి జన్మలో ఆమె సత్యభామగా జన్మించిందని చెప్పబడిందని పండితులు చెప్పారు.
అందువల్ల భర్త లేని స్త్రీలు కార్తీక వ్రతం, మార్గశిర వ్రతం. ఏకాదశి వ్రతం, షణ్ముఖ దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వసంత పంచమి దీపోత్సవం, ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి పూజలకి గాని ఎలాంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు.
ఆర్కియాలజిస్టుగా దివ్య (రెజీనా కసండ్రా) పురావస్తుశాఖలో పని చేస్తుంటుంది. నల్గొండ సమీపంలోని అడవిలో టూరిస్ట్ గా వచ్చిన విదేశీయుడు మాయమవుతాడు. అయితే అతను అడవిలోని ఊబిలో చిక్కుకుని మరణించాడని పోలీసులు గుర్తిస్తారు. అయితే డెడ్ బాడీ దొరకదు. దాంతో ఆర్కియాలజిస్టు దివ్య సహాయం తీసుకుంటారు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసే రాజా(వెన్నెల కిషోర్) సహాయంతో దివ్య అడవిలో పాతి పెట్టిన డెడ్ బాడీ స్కెలిటన్ ని వెలికితీసి పోలీసులకు అందజేస్తుంది.
కానీ ఫారెన్సిక్ పరిశోధనలో ఆ అస్థిపంజరం చనిపోయిన విదేశీయుడిది కాదని, చాలా ఏళ్ల క్రితం చనిపోయిన దమయంతి(రెజీనా )కి సంబంధించిందని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత దమయంతి డీసీపీని మరియు అతని తమ్ముడిని చంపుతుంది. అసలు దమయంతి ఎవరు? దివ్యకి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? డీసీపీని, అతని తమ్ముడిని దమయంతి ఆత్మ ఎందుకు చంపింది? అడవిలో అదృశ్యం అయిన విదేశీయుడు ఎవరు? అనేది మిగతా స్టోరీ.
రెజీనా కసండ్రా దివ్య, దయమంతిగా రెండు డిఫరెంట్ కోణాలు ఉన్న క్యారెక్టర్ లో నటించింది. జమీందారి ఫ్యామిలీకి చెందిన దయమంతిగా దర్బం, హోదాతో నటించింది. దివ్య పాత్రతో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొదట్లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత రొటీన్ హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా కొనసాగింది.
ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా తెలుగు చిత్రాలలో నటిస్తూ, లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. విరాట పర్వం మూవీ తరువాత కాస్త విరామం తీసుకున్న సాయి పల్లవి తమిళంలో ఒక చిత్రాన్ని, తెలుగులో నాగచైతన్యతో ఒక సినిమాని అంగీకరించింది.
అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవి రహస్యంగా ఒక డైరెక్టర్ ని ప్రేమించి, పెళ్లి చేసుకుందని రూమర్స్, దానికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో సాయి పల్లవి, కోలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి పూలదండలతో ఉన్నారు. అయితే అవన్నీ రూమర్స్. సాయి పల్లవి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (SK21) సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ ప్రారంభోత్సవంలో జరిపిన పూజలో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామితో పాటు సాయి పల్లవి పాల్గొంది. ఆ సమయంలో పూజారులు వారికి దండలు వేసి, క్లాప్ కొట్టటం, స్క్రిప్ట్ అందించారు.
ఈ ఫోటోలను దర్శకుడు రాజ్ కుమార్ పరియసామి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయం పై తాజాగా సాయి పల్లవి సీరియస్ ట్వీట్ చేసింది. “ఇటువంటి రూమర్స్ అసలు పట్టించుకోనని, కానీ ఈ రూమర్స్ వల్ల కుటుంబం, ఫ్రెండ్స్ ఇబ్బంది పడితే చూస్తూ ఉండలేను. ఆ ఫోటో ఒక మూవీ పూజా కార్యక్రమంలో తీసిన ఫోటో అని, కొంతమంది కావాలనే డబ్బులు ఇచ్చి ప్రచారాలను పుట్టిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి పనులు ఇప్పటికైనా ఆపండి. ఇంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదు.” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

