సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ఆడియెన్స్ ను మెప్పించారు. కథానాయకగా ఆణిముత్యాలాంటి చిత్రాలను అందించారు. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి వంటి అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించి, ఎన్నో అవార్డులను అందుకున్నారు.
జయసుధ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలలో నటించి మెప్పించి, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని పొందారు. కాగా, జయసుధ కుమారుడు కూడా ఇండస్ట్రీలో అడగుపెట్టారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత విలన్ గా నటించారు. ఇప్పుడు మళ్ళీ హీరోగా నటిస్తున్నాడు.
జయసుధ 1985లో బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకి ఇద్దరు కుమారులు నిహార్, శ్రేయంత్. పెద్ద కుమారుడు నిహార్ హీరోగా బస్తి అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. చాలామందికి ఈ మూవీ వచ్చిన సంగతి కూడా తెలియదు. 
ఆ మూవీ ఫ్లాప్ కావడంతో గ్యాంగ్ స్టార్ గంగరాజు మూవీలో విలన్ గా నటించి తన లక్ ను పరీక్షించుకున్నాడు. కానీ ఆ మూవీ సైతం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ మూవీలో నిహార్ యాక్టింగ్ కు గుర్తింపు వచ్చింది.నిహార్ ఎనిమిదేళ్ళ తరువాత హీరోగా రికార్డ్ బ్రేక్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ, మార్చి 8 న రిలీజ్ కానుంది.

ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చదలవాడ శ్రీనివాస్ దర్శకత్వం చేస్తూ, నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో నిహార్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డానని, తన సినిమాని ఆడియెన్స్ ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ మూవీని 8 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో 75వ ర్యాంక్ సాధించిన స్టార్ కమెడియన్ కుమారుడు..ఎవరంటే.?














కమెడియన్ సంతానంను హీరోగా నిలబెట్టిన చిత్రాలలో ఏ1 మూవీ ఒకటి. కోలీవుడ్ లో విడుదల అయిన ఐదేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏ1 మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు వెర్షన్ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు.
సంతానం కామెడీ సినిమా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తో పాటుగా రూ. 79 చెల్లించాల్సి ఉంటుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి జాన్సన్ కే దర్శకత్వం వహించాడు. అంచనాలు లేకుండా విడుదల అయిన సినిమా మంచి వసూళ్ళు సాధించి, స్టార్ హీరోల చిత్రాలతో పోటీగా విడుదల అయ్యి, బాక్సాఫీస్ విజేతగా నిలిచింది.











తనకంటూ ఉన్న ఒకేఒక ఆస్తి శంకర్ పల్లి దగ్గర ఉన్న ఎనిమిది ఎకరాల పొలం అని తెలిపారు. దానిని పవన్ ప్రేమతో కొన్నారని, పవన్‌కు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని అందుకోసమే, ఎన్నో ఏళ్ళ క్రితం కొనుగోలు చేశారని చెప్పారు. తన కెరీర్ మొదట్లో మూవీ ద్వారా వచ్చిన తొలి ఎనిమిది లక్షలతో ఈ పొలాన్ని తీసుకున్నాడు. అయితే దానిని కూడా ఒక టైమ్ లో అమ్మబోగా తానే వద్దని అడ్డుపడినట్లుగా తెలిపారు. ప్రస్తుతం పవన్ కి ఉన్న ఆస్తి శంకర్ పల్లి ఫార్మ్ హౌస్ ఒకటే అని నాగబాబు చెప్పుకొచ్చారు.

