సుమ కనకాల పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా తను ఒక మహోన్నత శిఖరం. ఇక రాజీవ్ కనకాల గురించి చెప్పనే అక్కర్లేదు అతను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరికీ ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు రోషన్ ని బబుల్ గమ్ సినిమా ద్వారా హీరోగా ఈ మధ్యనే పరిచయం చేశారు ఈ దంపతులు. ఇక అసలు విషయానికి వస్తే ఈ దంపతులు తమ 25 సంవత్సరాల వివాహ వేడుకను ఈ మధ్యనే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ సెలబ్రేషన్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా అయ్యాయి.



ఎందుకంటే ఈ జంట పెళ్లిరోజు వేడుకలని హైదరాబాదులోని ఒక వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు ఆశ్రమంలోని వృద్ధులకు ఆహారం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వృద్ధులతో ముచ్చటించారు ఈ దంపతులు. వారితో పాటు వారి పిల్లలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలను చూసిన సుమ మరియు రాజీవ్ అభిమానులు ఆ జంటను ప్రశంసిస్తున్నారు.




ఇక సుమ విషయానికి వస్తే తను పుట్టుకతో మలయాళీ అమ్మాయి కానీ తండ్రి ఉద్యోగరీత్యా ఆమె హైదరాబాద్ లో స్థిరపడింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజీవ్ తో అయిన పరిచయం తర్వాత వారిద్దరి పెళ్ళికి దారితీసింది. వీరిద్దరిది ఎంతో అన్యోన్య దాంపత్యం అయినప్పటికీ ఎన్నోసార్లు ప్రేక్షకులు వీళ్ళిద్దరూ విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారని, డైవర్స్ అయిపోయాయని రూమర్లు పుట్టిస్తూనే ఉన్నారు.



అలా రూమర్లు వచ్చిన ప్రతిసారి వారి కాపురం బలంగా ఉందని, కలిసి ఉన్న మమ్మల్ని విడదీయొద్దు అంటూ దంపతులు ఇద్దరు సోషల్ మీడియా ద్వారా విన్నవించుకునేవారు. ఎన్నిసార్లు వాళ్ళిద్దరూ కలిసి మేము కలిసే ఉన్నాము అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎందుకో వాళ్ళ విడాకులు టాపిక్ ఎప్పుడూ హైలెట్ గానే ఉంటూ వచ్చింది. అలాగే 25 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా లైఫ్ జర్నీ చేసిన ఈ జంట మరిన్ని పెళ్లి రోజులు ఆనందకరంగా జరుపుకోవాలని ఆశిద్దాం.




తల్లి ఉషారాణి గృహిణి, అక్క సుచిత సైతం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుందని అన్నారు. మానసికంగా తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కీలకమని ఆమె చెప్పుకొచ్చారు. చదువు విషయంలో ఎప్పుడూ ఇంట్లో నుండి ఒత్తిడి లేదని, టెన్త్ క్లాస్ లో 10 పాయింట్లు వచ్చినట్టుగా తెలిపారు. ఇంటర్మీడియట్ లో 985 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎంసెట్ లో 186వ ర్యాంక్ వచ్చిందని, సాఫ్త్ వేర్ ఫీల్డ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ లో చేరినట్టు తెలిపింది.
























