తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అక్రమాస్తులలో భాగమైన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని 36వ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు తేదీలను నిర్ణయించింది.

మార్చి 6,7 తేదీలలో వచ్చి బంగారు వజ్రాభరణాలను తీసుకువెళ్లాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిని తీసుకు వెళ్ళటానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని సూచించింది. ఈ రెండు రోజుల్లో ఇతర కేసులను విచారించకూడదని కోర్టు నిర్ణయించింది. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలన్నీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 468 రకాల బంగారు వజ్రాభరణాలు..

700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టుచీరలు, 250 శాలువాలు,12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 4 సి డి ప్లేయర్లు, ఒక వీడియో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డులు, 1,040 వీడియో క్యాసెట్లు, మూడు ఐరన్ లాకర్లు,1, 93, 202 నగదు ఉన్నాయి. 2014లో జయలలితకు అక్రమార్జన కేసులో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, 100 కోట్లు జరిమానా విధించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బిఐ లేదా ఎస్బిఐ ద్వారా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలిపింది.

ఇంతలో జయలలిత మరణించడంతో మళ్ళీ విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, అవసరమైన భద్రతతో రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. రెండు రాష్ట్రాలలోని స్థానిక పోలీసులతో అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్టార్ ని ఆదేశించారు.






శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


















ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఎంవీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త తమ పార్టీలోకి వస్తే పార్టీకి ఆర్థికంగా సహాయంగా ఉండటమే కాకుండా తప్పకుండా విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.



ఫలక్‌నుమా ప్యాలెస్ అద్భుతమైన చరిత్ర ఉన్న ఇండియన్ వారసత్వ ప్యాలెస్‌లలో ఒకటి. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన భవనాలలో ఒకటి. హైదరాబాద్ రాష్ట్ర నిజాం యొక్క అమూల్యమైన వారసత్వం. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని మరియు 6 వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క బావ నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా ఫలక్‌నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో నిర్మించారు. ‘ఫలక్-నుమా’ అనేది ఉర్దూ పదం, దీనికి
సర్ వికార్ అని పేరుగాంచిన నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా తన కలల అడుగుల ఎత్తైన కొండపై 1884లో మార్చి 3న పునాది రాయిని వేశారు. ఈ ప్యాలెస్ నిర్మాణం తొమ్మిది సంవత్సరాల పాటు సాగింది. దీని నిర్మాణం పూర్తిగా 1893లో పూర్తయింది. ఎంతో అందమైన ఈ ప్యాలెస్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ప్యాలెస్ 1,011,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్ డిజైన్‌ను రూపొందించడానికి ఒక ఆంగ్ల ఆర్కిటెక్ట్‌ని పిలిచాడు. విలియం వార్డ్ మారెట్ అనే శిల్పి ఈ ప్యాలెస్ ను ‘ఆండ్రియా పల్లాడియో’ అనే శైలిలో నిర్మించాడు.
ఇక ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఆ 130 సంవత్సరాల క్రితమే 40లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ ప్యాలెస్ అంతా ఇటాలియన్, ట్యూడర్ శైలుల సమ్మేళనంతో ఉన్న ప్రత్యేకమైన నిర్మాణం. ఈ ప్యాలెస్ నిర్మాణం కోసం ఇటలీ నుండి తెప్పించిన నాణ్యమైన ఇటాలియన్ పాలరాతితో కట్టారు. ఈ భవనం తేలు ఆకారంలో కనిపిస్తుంది. సర్ వకార్ రాశి వృచ్చికం అందువల్ల ఈ ప్యాలెస్ ను తేలు ఆకారంలో నిర్మించారు.
తేలు ఆకారంలో ఉన్న ప్యాలెస్ మధ్యలో ప్రధాన భవనం, గోల్ బంగ్లా, జెన్నా మహల్, వంటగది, దక్షిణ వైపు పట్టపు రాణులు, వారి చెలికత్తెల కోసం నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లోని కిటికీలకు వాడిన రంగు రంగుల అద్దాల నుంచి వచ్చే సూర్య కాంతి ప్యాలెస్ లోని గదులకు ప్రత్యేక ఆకర్షణ కలుగచేస్తాయి.
ఇంత అందమైన ప్యాలెస్ లో సర్ వికార్ 1897-98 వరకు మాత్రమే వ్యక్తిగత నివాసంగా ఉపయోగించుకున్నాడు. ఈ ప్యాలెస్ అత్యంత ఖరీదైన నిర్మాణం. దీని నిర్మాణం కోసం చేసిన అప్పులను కట్టడానికి వికార్ కు ఎంతో కాలం పట్టిందట. ఆ తర్వాత ప్యాలెస్ యాజమాన్య బాధ్యతలను 6వ నిజాంకు అప్పగించారు.
సర్ వికార్ తన భార్య ఇచ్చిన సలహా ప్రకారం అప్పటి రాజు మహబూబ్ అలీ పాషా నిజాంను ప్యాలెస్ కు ఆహ్వానించారు. ప్యాలెస్ కు వచ్చిన మహెబూబ్ అలీ పాషా ప్యాలెస్ యొక్క నిర్మాణానికి ముగ్దులయ్యారు. దానిని చూసిన తరువాత చాలా ఖరీదు అయ్యిందని, ప్యాలెస్ కట్టడం కోసం వికార్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలుసుకుని వకార్ కు అవసరమయిన ఆర్థిక సహాయం చేశారు. ఆయన అక్కడ నెలరోజుల పాటు ఉన్నారు.
సర్ వికార్ ప్యాలెస్ ను మహబూబ్ అలీ పాషాకు బహుమతిగా ఇచ్చాడు. కానీ అలీ పాషా దానిని బహుమతిగా స్వీకరించడానికి నిరాకరించాడు. ఆ ప్యాలెస్ కు తగిన మొత్తాన్ని ఇచ్చి తీసుకున్నాడు. ఆయన తరువాత ఏడో నిజాం ఈ ప్యాలెస్‌ను ‘రాయల్ గెస్ట్ హౌస్’ గా ఉపయోగించుకున్నారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని లైబ్రరీ ఇంగ్లాండ్‌లోని విండ్సర్ కాజిల్ లైబ్రరీ వలె గంభీరంగా ఉంటుంది. విండ్సర్ కాజిల్ లైబ్రరీ తరహాలో రూపొందించబడింది. ఇది నిజాం కచేరీల నుండి అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు మరియు పుస్తకాలను కలిగి ఉంది. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో ఇండియాలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి.
ఇక్కడి బిలియర్డ్స్ గదిలోని బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదు అయినది. ఇలాంటి అరుదైన టేబుల్స్ ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఫలక్‌నుమా ప్యాలెస్ లో ఉంది. మరొకటి లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఉంది. టేబుల్ అద్భుతమైన, విలాసవంతమై నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్యాలెస్ గోడల పై ఉన్న ప్రముఖుల ఫోటోలు ఆయిల్ పెయింటింగ్ తో వేశారు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం అని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన 108 అడుగుల డైనింగ్ టేబుల్ లో ఒకేసారి 101 మంది కూర్చుని భోజనం చేయవచ్చు. ఈ భారీ డైనింగ్ హాల్ ఫలక్‌నుమా ప్యాలెస్ కు ప్రత్యేక ఆకర్షణ. దీనిని ప్రత్యేకమైన కలపతో తయారు చేశారు. ఈ టేబుల్ 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తు ఉంది. ఈ టేబుల్ తయారీకి టేకు, రోజ్ ఉడ్లను ఉపయోగించారు. చుట్టూ ఉన్న కుర్చీలకు పచ్చని రంగు కల అరుదైన లెదర్‌ని వాడారు.
2000 సంవత్సరం ముందు సాధారణ ప్రజలను ఫలక్ నుమా ప్యాలెస్‌లోకి రానివ్వలేదు. తాజ్ గ్రూప్ ఈ ప్యాలెస్ ను అద్దెకు తీసుకుని, మరింతగా ఆధునీకరించి ఫ్రాన్స్ నుండి తీసుకువచ్చిన అందమైన ఫర్నీచర్ మరియు హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను మరింత అందంగా అలంకరించారు. ఈ హోటల్ 2010 నవంబర్ లో ప్రారంభం అయ్యింది. ఈ హోటల్లో ప్రస్తుతం ఎవరైనా భోజనం చేయవచ్చు.
ఈ ఇక్కడి డైనింగ్ టేబుల్ పై భోజనం చేయాలంటే మాత్రం కనీసం 40 మంది ఉండాలి. ఈ హోటల్ బస కూడా చాలా ఖరీదు. భోజనం ధర 5 వేలు. ప్రత్యేక టేబుల్ భోజనం రూ.18వేలు. ఒకరోజు ఇక్కడ ఉండటానికి దాదాపు 46,000. ఈ ప్యాలెస్ లో 60 గదులు మరియు 22 హాళ్లు ఉన్నాయి.