టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.
మొదటి చిత్రంతోనే తనదైన నటన, అందంతో మెప్పించిన పూజా హెగ్డే కుర్రాళ్లకు కలల రాజకుమారిగా మారిపోయింది. ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పూజా హెగ్డే లాగే ఉంది. మరి ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
పూజా హెగ్డే గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు పొందుతూ, తక్కువ కాలంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. పూజా హెగ్డే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. కోలీవుడ్ లో విజయ్ దళపతి బీస్ట్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్. హృతిక్ రోషన్ వంటి హీరోలతో నటించింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరుకారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే, అచ్చం పూజా హెగ్డేల కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పూజా హెగ్డేలా కనిపిస్తున్న ఆ అమ్మయి పేరు సవియా గోన్సాల్వేస్. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సవియా గోన్సాల్వేస్ ట్రావెల్, టూరిజం మారియు ఏవియేషన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 80 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సవియా గోన్సాల్వేస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
https://www.instagram.com/p/B-hYmysndR8/
Also Read: RRR లోని “నాటు నాటు” స్టెప్స్ ని ఆ హీరో మూవీ నుంచి కాపీ చేశారా…?





















డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బు వల్ల సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక మనిషి వీలునామా రాయకుండా మరణిస్తే కుటుంబ సభ్యులు ఆస్తిలో ఎవరికి ఎంత వాటా వస్తుంది అనే విషయం పై తగాదాలు పడుతుంటారు. చాలా సార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆస్తుల కోసం ఎప్పుడు ఊహించని వ్యక్తులు కూడా ఆస్తిలో తమకు వాటా ఉందంటూ తెరపైకి రావచ్చు. అలాంటి వాటికి హిందూ వారసత్వ చట్టం 1956 సమాధానం చెబుతుంది.
హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారంగా ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తి పై అతని భార్యకు, పిల్లలకు హక్కు ఉంటుంది. వీరిని షెడ్యూల్లోని క్లాస్-1 గా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి ఎలాంటి వీలునామాను రాయకుండా చనిపోతే, భార్యకు, పిల్లలు అతని ఆస్తికి సమాన హక్కుదారులు అవుతారు. అంటే ఒక వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉండి, అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండి, అతను వీలునామా రాయకుండా మరణించినట్లయితే షెడ్యూల్లోని క్లాస్-1వర్తిస్తుంది.
షెడ్యూల్లోని క్లాస్-1 ప్రకారం భార్య, కుమారులు, కుమార్తెల అందరికి సమానంగా పంపిణీ చేయబడుతుంది. అలా భార్యకు 2 ఎకరాలు, కుమారులకు, కుమార్తెలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి పిల్లలు తల్లికి వాటా ఇవ్వకుండా తామే తీసుకుంటే ఆమె 125 సిఆర్పీసీ ప్రకారం పిల్లలు మేజర్లు అయితే వారిపై ఫామిలి కోర్టులో మెయింటెనెన్స్ పిటిషన్ ను వేసినట్లయితే వెంటనే ఆమెకు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..
సాధరణంగా అయితే అందరు రెండు రకాల విధానాలలో కుర్చీలో కూర్చుని కాళ్ళను ఒకదాని మీద మరొకటి వేస్తుంటాము. మోకాలి పై మరొక మోకాలిని క్రాస్ చేయడం, చీల మండల దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం చేస్తుంటాం. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి. ఒకదానితో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు, మోకాలు, పాదం వంటి శరీరంలోని క్రింది భాగాలకి రక్తప్రసరణలో మార్పులు వస్తాయి.
చీల మండలం దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం కంటే మోకాలి పై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం అని చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికం అవుతుంది. కాలు మీద కాలు వేసుకుని సుధీర్ఘకాలం తరచు కూర్చుంటే కండరాలు పొడవు, పెల్విక్ బోన్స్ అమరికలో ధీర్ఘకాలీక మార్పులు వస్తుంటాయి. ముందుకు వంగిపోయే గుణం, భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. మెడ ఎముకలలో మార్పులు రావడంతో తల భాగం అమరికలో మార్పులు వస్తుంటాయి.
దాంతో మెడకు కూడా ప్రభావితం అవుతుంది. పొత్తికడుపు కాండరాల్లో, వెన్నుముక కింద భాగంలో కూడా మార్పులు రావచ్చు. ఒక వైపు పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భారం పడడం వల్ల పొత్తికడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారుతుంది. గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలో మారే ప్రమాదం ఉంది.
క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నారాలుగా పిలిచే పెరోనియల్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురి అయిన వ్యక్తి తన కాలి వేళ్ళను, ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేరు. అయితే చాలా వరకు ఇది స్వల్పకాలికమే. కొన్ని నిముషాల తరువాత సాధారణ స్థితికి వస్తాయి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం వల్ల సంతాన ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఆ సమస్య కూడా వస్తుంది.