తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఆడియెన్స్ కు హీరో విశాల్ పలు డబ్బింగ్ సినిమాల ద్వారా సుపరిచితమే. విశాల్ హీరోగా తెలుగు డబ్ అయిన పందెం కోడి, భరణి, పొగరు, డిటెక్టివ్, అభిమన్యుడు లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.
విశాల్ తాను నటించే ప్రతి మూవీకి చాలా కష్టపడుతుంటాడు. రియల్ స్టంట్స్ చేస్తుంటాడు. ఆ క్రమంలో ఎన్నో సార్లు గాయపడ్డాడు. అయినప్పటికీ ఫైట్స్ విషయంలో రాజీపడకుండా చేస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో విశాల్ నటించిన సెల్యూట్ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 2008లో సత్యం అనే తమిళ యాక్షన్ డ్రామా మూవీలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ సహచరుడు ఎ. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకి దర్శకుడిగా మొదటి సినిమా. ఈ మూవీలో విశాల్ తొలి సారిగా పోలీసు క్యారెక్టర్ లో నటించాడు.
లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. అయితే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని ‘సెల్యూట్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు, అయితే ఈ మూవీ తమిళ, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. సెల్యూట్ మూవీ 2008లోఆగస్టు 14న విడుదలైంది.
ఈ చిత్రాన్ని విశాల్ అన్న విక్రమ్ కృష్ణ నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీలోని ఒక యాక్షన్ సీన్ ను ఇన్ స్టా ఎంటర్టైన్మెంట్ జోన్ అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ సీన్ లో విశాల్ కిక్ చేసిన బాల్ రౌడీలందరికి తగిలి, మళ్ళీ విశాల్ చేతిలో రొటేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఎవరో బోయపాటికి బ్రదర్ లాగా ఉన్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CuYWWuXp1Cu/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “అతను యాక్టర్ కాదు… అంతా హింస..!” అంటూ… “ప్రభాస్” పై ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కామెంట్స్..!

















బయోపిక్ డ్రామాగా వచ్చిన “తర్లా ” ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, షరీబ్ హష్మీ జంటగా నటించారు. పూర్ణేందు భట్టాచార్య, భారతీ అచ్రేకర్, వీణా నాయర్ తదితరులు నటించారు. కథ విషయనికి వస్తే, పెద్ద కలలు కనే మిడిల్ క్లాస్ అమ్మాయి తర్లా (హుమా ఖురేషి). జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకునే ఆమెకి పెళ్లి జరగడంతో సినిమా మొదలవుతుంది. వృత్తిరీత్యా ఇంజనీర్ నలిన్ (షరీబ్ హష్మీ)ని తర్లా పెళ్లి చేసుకుంటుంది.
కాలేజ్‌కి వెళ్లే తర్లా పెళ్లి అనంతరం వంట చేయడం ఎలా నేర్చుకుంది. అందరికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆ తరువాత తన సొంత వంటల పుస్తకాలతో, భర్త సపోర్ట్ తో ఎలా ఎదిగింది అనేది స్టోరీ. హుమా ఖురేషి తర్లా దలాల్ పాత్రలో మెప్పించింది. షరీబ్ హష్మీ భార్యకు సహాయం చేసే భర్త పాత్రలో మెప్పించాడు.
మూవీలోని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. పాటలు ఫర్వాలేదు. సింపుల్ కథను చక్కగా చూపించారు. సాలు కె థామస్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. రాకేష్ యాదవ్ ప్రొడక్షన్ డిజైన్ మరియు తస్నీమ్ ఖాన్ కాస్ట్యూమ్స్ 1960-80 కాలానికి సంబంధించినవి ఉపయోగించారు. తర్లాను ఫిల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు.




