గుర్ఫతే సింగ్ పిర్జాదా బాలీవుడ్ నటుడు. పలు హిందీ చిత్రాలలో మరియు వెబ్ సిరీస్‌లలో నటించాడు. ఈ నటుడు 2018లో ఫ్రెండ్స్ ఇన్ లాతో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే, నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ మూవీ గిల్టీలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ క్లాస్‌లో నటించాడు.
గుర్ఫతే సింగ్ పిర్జాదా అక్క తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోలతో నటించి, స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందంతో, నటనతో తెలుగు ఆడియెన్స్ ను అలరించి, ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
గుర్ఫతే సింగ్ పిర్జాదా అక్క మరెవరో కాదు. ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’ మూవీలో సందడి చేసిన మెహ్రీన్ పిర్జాదా. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ తేజ్‌కి జంటగా మెహ్రీన్ నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో కూడా నటించి అలరించింది.
మెహ్రీన్ పిర్జాదా 1995లో పంజాబ్‌లో నవంబర్ 5న సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె తమ్ముడు గుర్ఫతే సింగ్ పిర్జాదా అనే తమ్ముడు ఉన్నాడు. అతను మోడల్ మరియు నటుడు. మెహ్రీన్ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు. ఆ మూవీ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
మహానుభావుడు, కవచం, రాజా ది గ్రేట్, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 లాంటి చిత్రాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ చిత్రాలలో నటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ తరచూ తన ఫోటో షూట్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. మెహ్రీన్ పెట్టే పోస్టులకు లైకుల, కామెంట్లు పెడుతుంటారు.
https://www.instagram.com/p/CnV9TzPvPXE/