మద్యం మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మందు బాబులు బస్సుల్లో, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల చేసే సమయాల్లో వారు చేసే రచ్చకు సంబంధించిన వార్తలు, వీడియోలు వైరల్ అవడం తెలిసిందే. ఈ మధ్యకాలంలో మద్యం సేవించి పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తులలో మహిళలు కూడా ఉంటున్నారు.
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే సమయంలో మద్యం సేవించిన మహిళలు వారిని ఇబ్బంది పెట్టడం కూడా చూస్తూనే ఉన్నాము. తాజాగా ఒక ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ఒక మహిళ కండక్టర్ని బూతులు ఇట్టాడమే కాకుండా అతని పై అటాక్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన పై టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా స్పందించారు.
హయత్ నగర్ బస్ డిపో 1 బస్ కండక్టర్ ను ఒక యువతి మద్యం మత్తులో బూతులు తిడుతూ, అతని పై దాడి చేసిన ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది తెలియలేదు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి, హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ మార్గంలో నడిచే 72 బస్ లో ఉదయాన్నే ఒక యువతి మద్యం సేవించి ఎక్కింది. 500 రూపాయల నోటు ఇచ్చి టికెట్ ఇవ్వమనడంతో కండక్టర్ ఇంత ఉదయం చిల్లర ఉండదని తెలిపాడు.
దాంతో ఆగ్రహించిన యువతి బస్ కండక్టర్ని నానా బూతులు తిట్టి, కొట్టడమే కాకుండా తోటీప్రయాణికులు చెబుతున్నా వినకుండా కండక్టర్ని కాలుతో తన్నడం, ఉమ్మడం జరిగింది. ఎంత చెబుతున్నా వినకుండా కండక్టర్పై దాడి చేసింది. ఆమె ప్రవర్తన భరించలేక చివరికి బస్సును పక్కకు ఆపడంతో ఆమె దిగిపోయింది.
అయితే దిగే ముందు కూడా బస్సులో ఉన్న మరో స్త్రీని సైతం బూతులు తిట్టింది. ఇదంతా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘట పై ఎండి సజ్జనార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ
హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2024
Also Read: అన్నా అని పిలుస్తాను… అతనితో నా పెళ్ళి ఏంటి? వ్యూస్ కోసం మా లైఫ్ తో ఆడుకోవద్దు.!