సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మూవీకి బీస్ట్, డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ లు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఈ చిత్రం పై అంచనాలని మరింతగా పెంచేశాయి.
జైలర్ మూవీ ఈ రోజు భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ చూసిన నెటిజెన్లు సామాజిక మధ్యమాలలో తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఈ చిత్రంలో విలన్ గా చేసిన నటుడు తన నటన, హావభావాలు, ఆహార్యంతో ఆకట్టుకున్నాడని కామెట్ చేస్తున్నారు. మరి ఆ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.. జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారువినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.
Also Read: JAILER REVIEW : “రజినీకాంత్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!