సినీ సెలబ్రెటీల పుట్టిన రోజు లేదా వారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు అయినా వారి రేర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు ఎక్కువగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. స్టార్స్ సైతం అప్పుడప్పుడు వారి చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
నెటిజన్లు తమ అభిమాన హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా నెట్టింట్లో త్రో బ్యాక్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో స్టార్ హీరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో గ్రీన్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరో. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
ఈ హీరో కోలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కంటెంట్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తూ, కొత్త స్టోరీలకు మద్దతిస్తూ, కథ నచ్చితే ఆ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అయ్యే తమిళ హీరో. రజినీ కాంత్ మరియు కమల్ హాసన్ లను కలిపితే ఆ హీరో అని అక్కడి ఆడియెన్స్ పిలుస్తారు. రీసెంట్ గా తెలుగులో హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ సినిమాలో సైతం నటించాడు.
సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమాలలో నటిస్తూ ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆ హీరో ఎవరో అర్థమై ఉంటుంది. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ ధనుష్. సార్ మూవీతో టాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న, ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయనున్నారు.
పాన్ ఇండియా సినిమా కెప్టెన్ మిల్లర్‌తో ఆడియెన్స్ ను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు చిత్రాలను పట్టాలెక్కించారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అలాగే తన స్వీయ దర్శకత్వంలో 50వ చిత్రాన్ని కూడా ధనుష్ ప్రారంభించారు.