తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బర్రెలక్క చాలా సెన్సేషన్ సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి ఎమ్మెల్యేగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే బర్రెల కి కేవలం 5000 పైబడి ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా తాను బాధపడటం లేదని తనకి సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. అయితే ఇప్పుడు బర్రె లెక్కని పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ వైసిపి నాయకులు కామెంట్లు చేస్తున్నారు. నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు విన్న బర్రె లెక్క స్పందించింది తాను స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమానిని అని, పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారని ఆయనే తనకి స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది. వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ అని తనతో పోల్చడం బాధిస్తుందని అంది. యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు తనని చాలా ప్రభావితం చేశాయని అంది.
ఎవరి పవర్ వాళ్ళదని, నా పవర్ నాది పవన్ కళ్యాణ్ పవర్ పవన్ కళ్యాణ్ ది, ఆయనని తక్కువ చేయడం కోసం నాతో పోల్చడం సరికాదు అని మాట్లాడింది. బర్రెలక్కకి ఉన్న కామన్ సెన్స్ కూడా వైసిపికి నాయకులకు లేదంటూ జనసేన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.