మన సీరియల్ హీరోయిన్స్ కి కూడా సినిమా హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అలా, కొంత కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్. ప్రియాంక జైన్ ప్రస్తుతం జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా అడుగుపట్టి, మంచి పోటీ ఇచ్చి, మరింతగా పాపులర్ అయ్యారు.

తాజాగా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియో షేర్ చేశారు. తన తల్లి ఫాల్గుణి జైన్ క్యాన్సర్ బారిన పడ్డారని, సర్జరీ జరుగగా, ప్రస్తుతం కోలుకుంటున్నారని ప్రియాంక మరియు శివకుమార్ ‘నెవర్ ఎండింగ్ స్టోరీస్’ యూట్యూబ్ ఛానెల్ లో పంచుకున్నారు. ప్రియాంక జైన్ కన్నీటిపర్యంతం అయ్యారు… ఆమె మాట్లాడుతూ “మీరు చూసింది మా అమ్మనే. క్యాన్సర్ వ్యాధితో ఆమె అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి, లైఫ్ చాలా మారిపోయింది.

తన వాళ్లతో బెంగుళూరుకు వచ్చి సంతోషంగా ఉందమని అనుకున్నాను. కుటుంబంతో గడపాలని భావించిన సమయంలో అమ్మకి ఇటువంటి కండిషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రియాంక జైన్ బిగ్ బాస్ లో ఉన్న టైమ్ లోనే ఆమె తల్లికి పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడం ప్రారంభం అయ్యిందంట. అయితే మెనోపాజ్ స్టేజ్ లో ఇలాంటివి కామన్ అని ఫాల్గుణి జైన్ అంతగా పట్టించుకోలేదంట.
ప్రియాంక బిగ్ బాస్ నుండి వచ్చిన అనంతరం తల్లికి అదే కండిషన్ కొనసాగడంతో హాస్పటల్ కు తీసుకెళ్లి టెస్ట్ లు చేసిన తరువాత క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని డాక్టర్లు చెప్పారంట. దాంతో వెంటనే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి యూట్రస్ను రిమూవ్ చేశారట. ప్రస్తుతం ప్రియాంక తల్లి కోలుకుంటున్నట్లుగా ప్రియాంక వీడియోలో తెలిపారు.






























కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. రికార్డ్ బ్రేకింగ్‌లో కూడా నంబర్ వన్ పోటీదారుడుగా కూడా ఉన్నాడు. కోహ్లి 17 కోట్లకు పైగా ఎండార్స్మెంట్ల ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ధోని రోజుకు 1.5 కోట్లు తీసుకుంటుండగా, కోహ్లీ రోజుకు రూ.2 కోట్లు వసూలు చేస్తాడు. విరాట్ కోహ్లీ ఒక యాడ్ షూట్ కోసం ఒప్పందం చేసుకున్న కంపెనీ వారికి 2 లేదా 3 రోజుల సమయం మాత్రమే ఇస్తాడు. వారు ఆ రోజుల్లోనే యాడ్ చిత్రీకరణ, ప్రెస్ మీట్ లాంటివి చేయాలి. ఇక ఆ యాడ్ షూట్ జరిగే సమయంలో కోహ్లి రోజుకి రెండు కోట్లు వసూలు చేస్తాడు.
అంతే కాకుండా కోహ్లీకి ఇంకో రకంగా కూడా సంపాదిస్తున్నాడు. కోహ్లీ ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా కూడా ఆర్జిస్తున్నాడు. వస్తుంది. ఇన్స్టాగ్రాం ఖాతాలో కోహ్లీ 16.7 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. కోహ్లీ ఇన్స్టాగ్రాం ఖాతాలో ఏదైనా కంపెనీ బ్రాండ్ గురించి ఒక పోస్ట్ పెట్టాలంటే దాని కోసం రూ.3.2 కోట్ల వరకు వసూల్ చేస్తాడంట. కచ్చితంగా అడిగిన డబ్బు చెల్లిస్తేనే తన ఇన్స్టాగ్రాం ఖాతాలో సదరు కంపెనీకి చెందిన పోస్ట్ ను పెడతాడంట.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో సమానంగా రోజుకు రూ. 2 కోట్లతో కోహ్లీ దాదాపు 3 రోజుల పాటు ఒప్పందాలు కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం, కోహ్లీ చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. కోహ్లీ ఒప్పందం చేసుకున్న బ్రాండ్స్ లో మన్యవర్, సింథోల్ డియో, పెప్సీ, బూస్ట్, రీబాక్, ఫాస్ట్రాక్, హెడ్ & షోల్డర్స్, గోద్రెజ్, నెస్లే ఇండియా లాంటివి ఉన్నాయి. కోహ్లీ కొన్ని కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టాడని సమాచారం.