రాజనాల మొదలుకొని కైకాల సత్యనారాయణ , కోటా శ్రీనివాసరావు , నర్రా వెంకటేశ్వర్రావు , రామిరెడ్డి, సత్య, అమ్రిష్ పూరి ఇలా చెప్పుకుంటూ పోతే మన విలన్ల లిస్టు పెద్దదే. సినిమాల్లో విలన్లుగా వీళ్లని చూడగానే దడపుట్టేది . ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంలో హీరో పాత్ర ఎంతుంటుందో,హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర కూడా అంతే ఉంటుంది.

ఇప్పటి చిత్రాల్లో విలన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రకాశ్ రాజ్ . తండ్రిగా ప్రేమని ప్రదర్శిస్తూనే ఒకే సమయంలో విలన్ గా కూడా విలక్షణంగా నటించగల నటుడు ప్రకాశ్ రాజ్ .ప్రభాకర్,అజయ్, ముకేశ్ రుషి, షియాజి షిండే, పరేష్ రావెల్,అశుతోష్ రానా, రోబో చిత్ర విలన్ డాని, మురళి శర్మ వీళ్లందరిది విలనిజంలో విభిన్న పంథా.

మురళీ శర్మ గురించి చెప్పాలంటే…భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, అల వైకుంఠపురం లో ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో అతిధి సినిమాలో ఆయన పాత్ర గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన కుటుంబం, భార్య పిల్లల గురించి చాలా మందికి తెలియదు. ఆయన భార్య పేరు అశ్విని కాల శేఖర్. ఆమె కూడా నటే. బద్రీనాథ్ సినిమాలో విలన్ భార్యగా నటించారు. తమన్నాతో ఆమె చెప్పే డైలాగ్ ” నేనెవరో తెలుసా నీ మేనత్తని ఈ రాష్ట్రాన్ని పాలించే సర్కార్ భార్యని” చాలా ఫేమస్. రవితేజ “నిప్పు”, మెహబూబా సినిమాల్లో కూడా ఈమె నటించారు.





ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మొరారీ బాపు రామ మందిర నిర్మాణానికి అత్యధిక విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. మొరారీ బాపు గుజరాతీకి చెందిన ఆధ్యాత్మిక గురువు, రామ కథా పారాయణుడు.
1946లో గుజరాత్ లో జన్మించిన మొరారీ బాపు రామాయణ ప్రతిపాదకుడు. 60 ఏళ్ళుగా పండితుడు రామ కథా పఠనం ద్వారా సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రాలను దేశ విదేశాల్లో చెబుతూ వస్తున్నారు. రామజన్మభూమి ట్రస్టుకు ఇప్పటికే రూ.11.3 కోట్లు ఇచ్చామని బాపు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కథ ప్రదర్శన, విదేశాల నుండి సేకరించిన మిగిలిన నిధులను రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు చేరుస్తారు. ఇలా మొత్తం రూ.18.6 కోట్ల విరాళాలు సేకరించిన మొరారీ బాపు ట్రస్ట్‌కు అందించారు.
శాంతియుతంగా అయోధ్య వివాద పరిష్కరించుకోవాలని మొరారీ బాపు పిలుపునిచ్చారు. రామ భక్తుడైన మొరారీ బాపు రామమందిరం ప్రారంభోత్సవంతో మనసు నిండిపోయిందని చెప్పారు. రాముడు ఏ ఒక్క దేశానికి లేదా వర్గానికి చెందినవాడు కాదని రాముడు అందరికీ చెందినవాడని అంటారు. రామ్ లల్లా దీక్ష తరువాత, ఫిబ్రవరి 24 నుండి మార్చి 3 వరకు మొరారీ బాపు అయోధ్యలో కథను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.








“ఒకే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కూర్చుని ఉన్నప్పుడు కాళ్ళను తరచూ ఊపడం లేదా కదిలించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని” అని న్యూట్రిషనిస్ట్‌గా యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో వర్క్ చేసే జానెత్ కాడే వెల్లడించింది. గంటల తరబడి కుర్చీలో కూర్చుని ఉండటం వల్ల, బాడీలోని మెటాబాలిజం రేటు తగ్గిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్‌ను, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే సామర్థ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే శరీరంలోని ఫ్యాట్ ను కరిగించేందుకు అడ్డంకిగా కూడా మారుతుంది.