సినిమాలకి భాషా బేధం ఉండదు. అందులోనూ ఇప్పటి సమయాల్లో మాత్రం ఏ భాష సినిమా అయినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే చాలా సినిమాలు అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఓటీటీల పుణ్యమా అని సినిమాలు ఇంకా ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అవుతున్నాయి. అలా ఇటీవల వచ్చిన సినిమా నేరు. మోహన్ లాల్, ప్రియమణి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. మలయాళంలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే, సారా మహమ్మద్ (అనస్వర రాజన్) అనే ఒక అమ్మాయికి కళ్ళు కనిపించవు. ఒక రోజు ఆ అమ్మాయిని వేధిస్తారు. కానీ అమ్మాయిని అలా చేసిన వాళ్ళు ఎవరో తనకి తెలియదు. సారా అతని పోలికలని గుర్తు పెట్టుకొని, మట్టితో అతని రూపాన్ని తయారు చేస్తుంది. సారా తయారు చేసిన ఆ మట్టి బొమ్మ మైకేల్ (శంకర్ ఇందుచూడన్) అనే వ్యక్తి పోలికలకి దగ్గరగా ఉంటుంది. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే మైకేల్ తండ్రి చాలా పెద్ద పారిశ్రామికవేత్త. అందుకే పెద్ద లాయర్ అయిన రాజశేఖర్ సహాయంతో బెయిల్ సంపాదించుకుంటారు.

దాంతో సారా తల్లిదండ్రులు లాయర్ అయిన విజయ్ మోహన్ (మోహన్ లాల్)ని ఈ కేస్ వాదించడం కోసం ఆశ్రయిస్తారు. మరొక పక్క విజయ్ మోహన్ కొన్ని కారణాల వల్ల చాలా సంవత్సరాలు కోర్టుకి దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ కేస్ ఎలా వాదించాడు అనే విషయం మీద సినిమా అంతా నడుస్తుంది. సినిమా కథ చాలా బలంగా ఉంటుంది. చాలా చోట్ల నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ ఉంటుంది. అంతే కాకుండా ఒక మంచి స్టోరీకి మంచి నటీనటుల నటన తోడైతే సినిమా ఇంకొక లెవెల్ కి వెళ్తుంది అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.

ఈ సినిమాకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. సినిమా ఒక సెన్సిటివ్ విషయం మీద నడుస్తున్నా కూడా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది కలగనంత బాగా డీల్ చేశారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ఇంత మంచి సినిమాని తెలుగులో రీమేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఒరిజినల్ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ALSO READ : సీనియర్ హీరోల చూపంతా ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ పైనే అనుకుంట.? హీరోలనే డామినేట్ చేస్తుందిగా.!



తలుపులు, కిటికీలు, లేని ట్రైన్స్ ఉంటాయి. కొన్నిట్రైన్స్ బోగీలకు తలుపులు, కిటికీలు ఉండవు. పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది. వీటిని ఎన్ఎంజీ ట్రైన్స్ అంటారు. మిగతా రైళ్లతో పాటుగా ఎన్ఎంజీ ట్రైన్ ను కూడా ఇండియన్ రైల్వే నడుపుతోంది. సాధారణంగా రైలు ప్రయాణం చేసేవారు ఎక్కడో ఒక చోట ఎన్ఎంజీ రైలును గమనించే ఉంటారు. ప్యాసింజర్ ట్రైన్స్ ను ఎన్ఎంజీ రైళ్లుగా మారుస్తారు.
ఎన్ఎంజీ రైలు అంటే..
ప్యాసింజర్ – ఎన్ఎంజీ రైళ్లు..
లోపల ఉండే సీట్లన్నీ తొలగిస్తారు. లైట్లు, ఫ్యాన్లు తీసివేసి, దృఢంగా మార్చడం కోసం ఐరన్ స్ట్రిప్స్ ను వాడతారు. దీనినే ఎన్ఎంజీ అంటారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వెహికిల్స్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో గాంధీ నడిచిన దారిని ఇప్పటికీ గాంధీ రోడ్డు అని పిలుస్తుంటారు. ఈ రోడ్ లో ఒక ఓల్డ్ బేకరీ ఉంది. అది ఇప్పటిది కాదు. స్వతంత్రం రాకముందు, 1933 లో ప్రారంభించిన రామకృష్ణ బేకరీ ఇది. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ షాప్ లో లభించే స్వీట్ చాలా ఫేమస్. ఈ బేకరీలో ఇప్పటికీ స్వాతంత్ర ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఈ బేకరిని 1936 లో శ్రీ రామ కృష్ణయ్య మొదలుపెట్టారు. ఇప్పటికీ వారి వారసులు దానిని కొనసాగిస్తున్నారు.
గాంధీజీ 1921 లో ఈ మార్గం గుండా నడిచారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో గత తొంబై సంవత్సరాలుగా రామకృష్ణ బేకరీ ఒక ప్రత్యేక స్వీట్ ను అందిస్తోంది. ఆ స్వీట్ పేరు బాసంతి. దీనిని బాసుంది అని కూడా పిలుస్తారు. ఈ స్వీట్ ని చూస్తే స్థానీకులకే కాకుండా తిరుపతికి వచ్చే టూరిస్టులకు కూడా నోరూరుతుంది. పాలకోవాను ఇష్టపడే స్వీట్ లవర్స్ బాసంతిని సైతం అంతే ఇష్టంగా తింటారు.
బాసంతి కప్పు ధర 50 రూపాయలు. దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ బేకరిని గాంధీజీ కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆ బేకరీలో కనిపిస్తాయి. “90 సంవత్సరాలుగా బాసంతి తయారీలో ఎటువంటి మార్పులు చేయలేదని, అప్పటిలానే ఇప్పుడు తయారు చేస్తూ వస్తున్నమని” నిర్వాహకులు కుమార్ వెల్లడించారు.





రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆ నలుగురు’ సినిమా 2004 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. నటి ఆమని, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, హీరో రాజా లాంటి వారు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.
విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ టీవిలో వస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకి హీరోగా ముందుగా అనుకున్నది రాజేంద్రప్రసాద్ కాదు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. చంద్ర సిద్ధార్థ ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి, నటించాలని అనుకున్నారంట. కానీ ఆయన వయసు రీత్యా ఎక్కువ నిడివి పాత్రలో నటించలేనని అన్నారంట.
అలా రాజేంద్రప్రసాద్ నటించారు. అలాగే సినిమాలో హీరోయిన్ కోసం గౌతమి, లక్ష్మి, సుహాసిని, భానుప్రియ, రోజా వంటి వారిని సంప్రదించారట. వారు రిజెక్ట్ చేయడంతో రాజేంద్ర ప్రసాద్ ఆమనిను సూచించడంతో ఆమెను తీసుకున్నారంట. ఈ మూవీ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.
