ఒక రోజులో “విరాట్ కోహ్లీ” ఎంత సంపాదిస్తారో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

ఒక రోజులో “విరాట్ కోహ్లీ” ఎంత సంపాదిస్తారో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

Ads

అంతర్జాతీయంగా ఉన్న అత్యుత్త‌మ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. కోహ్లీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. అతను ఒక క్రికెటర్ గా ఎంత పేరు తెచ్చుకున్నాడో , సెల‌బ్రిటీగా అంతే పేరును సొంతం చేసుకున్నాడు.

Video Advertisement

అత్యధికంగా సంపాదిస్తున్న భారత క్రికెటర్ల లిస్ట్ లో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. దాంతో ఎన్నో కంపెనీలు త‌మ బ్రాండ్ ప్రమోషన్ చేయడం కోసం విరాట్ కోహ్లీని ఎంచుకున్నాయి. ఒక యాడ్ చేయటానికి కోహ్లీ ఒక రోజుకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. రికార్డ్ బ్రేకింగ్‌లో కూడా నంబర్ వన్ పోటీదారుడుగా కూడా ఉన్నాడు. కోహ్లి 17 కోట్లకు పైగా ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ధోని రోజుకు 1.5 కోట్లు తీసుకుంటుండగా, కోహ్లీ రోజుకు రూ.2 కోట్లు వసూలు చేస్తాడు. విరాట్ కోహ్లీ ఒక యాడ్ షూట్ కోసం ఒప్పందం చేసుకున్న కంపెనీ వారికి 2 లేదా 3 రోజుల సమయం మాత్రమే ఇస్తాడు. వారు ఆ రోజుల్లోనే యాడ్ చిత్రీకరణ, ప్రెస్ మీట్ లాంటివి చేయాలి. ఇక ఆ యాడ్ షూట్ జరిగే స‌మ‌యంలో కోహ్లి రోజుకి రెండు కోట్లు వ‌సూలు చేస్తాడు.
అంతే కాకుండా కోహ్లీకి ఇంకో రకంగా కూడా సంపాదిస్తున్నాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా కూడా ఆర్జిస్తున్నాడు. వస్తుంది. ఇన్‌స్టాగ్రాం ఖాతాలో కోహ్లీ 16.7 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లను కలిగి ఉన్నాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఏదైనా కంపెనీ బ్రాండ్ గురించి ఒక పోస్ట్ పెట్టాలంటే దాని కోసం రూ.3.2 కోట్ల వ‌ర‌కు వసూల్ చేస్తాడంట. క‌చ్చితంగా అడిగిన డబ్బు చెల్లిస్తేనే తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో సదరు కంపెనీకి చెందిన పోస్ట్ ను పెడతాడంట. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో సమానంగా రోజుకు రూ. 2 కోట్లతో కోహ్లీ దాదాపు 3 రోజుల పాటు ఒప్పందాలు కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం, కోహ్లీ చాలా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. కోహ్లీ ఒప్పందం చేసుకున్న బ్రాండ్స్ లో మన్యవర్, సింథోల్ డియో, పెప్సీ, బూస్ట్, రీబాక్, ఫాస్ట్రాక్, హెడ్ & షోల్డర్స్, గోద్రెజ్, నెస్లే ఇండియా లాంటివి ఉన్నాయి. కోహ్లీ కొన్ని కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టాడని సమాచారం.

Also Read: SRH VS DC మ్యాచ్ లో కెమెరాకి చిక్కిన… ఈ “మిస్టరీ గర్ల్” ఎవరో తెలుసా..?


End of Article

You may also like