సక్సెస్ లో ఉన్నోడికి మన ఇచ్చే విలువ, మర్యాద కొంచెం ఎక్కువే. అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. వరుసగా హిట్ కొడుతున్న డైరెక్టర్ ఇంటికెళ్లి మరీ, నాకు కూడా ఓ స్టోరీ రాయి మనం కలిసి చేద్దాం అంటారు హీరోలు.
అదే ఓ ఫ్లాప్ లేదా యావరేజ్ టాక్ వస్తే ఆ డైరెక్టర్ తో కలిసి సినిమా చేయాలి అంటే ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. కొందరైతే కథ వినడానికి కూడా ఇష్టపడరు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎందుకు భిన్నంగా సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కథ నచ్చితే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
అందుకు ఉదాహరణలే కింద పేర్కొన్న సినిమాలు..
1. వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి తొలి సినిమా మున్నా. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. అయితే చాలా గ్యాప్ తర్వాత వంశీ దిల్ రాజు బ్యానర్లో “బృందావనం” చేసాడు. వంశీకి యావరేజ్ డెబ్యూ ఉన్నా కూడా తారక్ ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు.
2. మెహర్ రమేష్

మెహర్ రమేష్ కి కంత్రి సినిమాలో తారక్ ఫస్ట్ టైమ్ వర్క్ చేసాడు. ఈ సినిమా యావరేజ్ అయినా మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ కానీ డైరెక్టర్ శక్తి సినిమాతో డిజాస్టర్ సినిమా ఇచ్చాడు.
3. పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్ కి టెంపర్ ముందు వరకు రోమియో, హర్ట్ ఎటాక్ వంటి వరుస ఫ్లాప్ లే ఉన్నాయి. చాలాకాలం తర్వాత తారక్, పూరీ కలిసి టెంపర్ సినిమా తీశారు. ఇది పెద్ద హిట్ అయింది.
4. సుకుమార్
సుకుమార్ మహేష్ బాబుతో చేసిన 1: నేనొక్కడినే ఒక పాఠంలాంటిది. ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి కానీ కమర్షియల్ గా ఫెయిల్ అయింది. ఐతే 1: నేన్నొకడినే తర్వాత తారక్ సుక్కుకి ఛాన్స్ ఇస్తే “నాన్నకు ప్రేమతో” వంటి హిట్ మూవీ వచ్చింది.
5. బాబీ
సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఫ్లాప్ తర్వాత బాబీ కి సినిమాలే రావు అనుకున్నారు. కానీ కట్ చేస్తే తారక్ బాబీకి ఛాన్స్ ఇచ్చాడు. జై లవ కుశ తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
6. త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి గురూజీ కెరీర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచింది.
ఆ సమయంలో తారక్ త్రివిక్రమ్ ను నమ్మి “అరవింద సమేత” కి ఓకే చెప్పాడు. దీంతో త్రివిక్రమ్ మళ్లీ విజయాల బాట పట్టాడు.
7. కొరటాల శివ

మొన్న ఆచార్య తో ఫ్లాప్‌లు లేని కొరటాల కి పెద్ద డిజాస్టర్ వచ్చింది. కానీ జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన కొరటాల కి తారక్ మళ్లీ ఎన్టీఆర్ కు అవకాశం ఇచ్చాడు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గత 3 నెలలుగా పోస్ట్ పోన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఆయనకు టైమ్ దొరికినప్పుడు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇటీవల జరిగిన షెడ్యూల్లో కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ కోలీవుడ్ మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో షికారు చేస్తోంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ గౌతమి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట. గౌతమి పవన్ కళ్యాణ్ కి మదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్, గౌతమి పైన డైరెక్టర్ హరీష్ శంకర్ కీలకమైన సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
గౌతమి ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ హీరోయిన్ గా కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి, స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం, అన్ని మంచి శకునములే లాంటి చిత్రాలలో గౌతమి నటించారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కి గౌతమి తల్లిగా నటిస్తున్నారనే వార్తలు రావడంతో 52 ఏళ్ల హీరోకు తల్లిగా, 55 ఏళ్ల హీరోయినా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, తన నటన, టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగి, కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మొదటి చిత్రంతో తన ప్రత్యేకతను చూపించారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.













