శ్రీరామ జన్మస్థలం అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారు. వారందరి కల సోమవారం నాడు సాకారం అయ్యింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వేడుకని యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా చూసారు.

అయితే అయోధ్య రాముడిని “రామ్ లల్లా” అని ఎందుకు అంటారు అంటే. తులసీదాస్ చేత రచించబడిన రామ్ చరిత మానస లో బాల రాముడుని రామ్ లల్లా అని వర్ణించారు. ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే మనం చిన్నపిల్లలని చిన్ను, బుజ్జి, చిట్టి, కన్నా అని ఎలాగైతే ప్రేమతో పిలుస్తామో అలాగే అప్పట్లో అయోధ్యలో చిన్న పిల్లలని లల్లా అని పిలిచేవారట. ఐదు నుంచి ఆరేళ్ల వయసులో ఉన్న రాముడ్ని రామ్ లల్లా అని అప్పట్లో వాళ్ళు పిలిచేవారట. దాన్నే తులసీదాస్ తన రామ్ చరిత మానస్ లో వర్ణించారు. అందుకే అయోధ్య రాముడ్ని రామ్ లల్లా అనే పేరుతో పిలుస్తున్నారు.

గత శుక్రవారం నాడు శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యకి తరలించారు. అయితే ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు కూడా ఉండేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఆ వివరణ కూడా ఎంతో చక్కగా రూపొందించారు అని విగ్రహం చూస్తుంటే తెలుస్తోంది.

అయితే ఈ విగ్రహం నల్లగా ఎందుకు ఉంది అని చాలామంది భక్తులకు డౌట్ వచ్చింది. గుడిలో విగ్రహాలకు సాధారణంగా అభిషేకం చేస్తారు. పాలతో అభిషేకం చేసినప్పుడు రాయి యొక్క మెరుపు తగ్గుతుంది. ఈ నల్లగా ఉండే రాయి మాత్రం మెరుపు తగ్గదు అంట. పైగా రాయి వెయ్యి సంవత్సరాలకు పైగా కూడా అరిగిపోదు అంట. అలాగే వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు ముదురు రంగులో ఎంతో అందంగా ఉన్నాడు అని వర్ణించారు. అందుకే రాముని విగ్రహం నల్లగా ఉంది.



















మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్‌లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.