ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాకి వచ్చిన క్రేజ్ ని కాపాడుకునే విధంగా పుష్ప2 ని రూపొందిస్తున్నారు.

దీనికోసం 400 కోట్ల పై బడి బడ్జెట్ ను కేటాయించారు. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సుకుమార్ కూడా తను అనుకున్నది వచ్చేవరకు నిద్రపోని డైరెక్టర్. నిర్మాతలు కూడా డైరెక్టర్ కి పూర్తి సహకారం అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప 2 విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .. కథ ప్రకారం పుష్పరాజ్ ఎర్రచందనం రవాణాకు సంబంధించి ఒక డీల్ మాట్లాడేందుకు జపాన్ వెళ్తాడట. అక్కడి డాన్ లతో తీరా ఒప్పందం కుదిరే టైంలో అక్కడున్న గ్యాంగ్ కుట్ర చేయడంతో అక్కడే చిక్కుకుంటాడు. ఊహించని విధంగా కింగ్ పిన్ ని అక్కడే చంపేసే ఎపిసోడ్ హైలైట్ అవుతుంది అంట. మరి అది నిజమో కాదో చూడాలి.

మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్‌లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.








