ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ ని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైన కరీనా కపూర్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి చాలా సంవత్సరాలు తర్వాత నెట్ఫ్లిక్స్ లో జానే జాన్ అనే ఒక మూవీ చేసింది. కానీ అది అంత మంచి రెస్పాన్స్ అందుకోకపోవడంతో కం బ్యాక్ ఇవ్వలేక పోయింది. కానీ రీసెంట్గా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న కరీనాను నీకు ఇష్టమైన సౌత్ ఇండియన్ యాక్టర్ ఎవరు?

ఎవరితో నువ్వు నటించాలనుకుంటున్నావు? అని కరణ్ అడగగా నాకు రాక్ స్టార్ యష్ అంటే చాలా ఇష్టం. కేజిఎఫ్ సినిమా చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తనతో సినిమా చేయాలనుంది అని చెప్పింది కరీనా కపూర్. అయితే తను అనుకున్నది నెరవేరే రోజు వచ్చేసింది. రాక్ స్టార్ యష్ తాజా చిత్రం టాక్సిక్ లో కరీనా కపూర్ నే మెయిన్ లీడ్ గా అనుకుంటున్నారట మేకర్స్. ఈ మూవీని కరీనా కపూర్ సైన్ చేస్తే ఇదే తన సౌత్ ఇండియాలో ఫస్ట్ సినిమా అవుతుంది.
గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ గ్రోన్ అప్ ఫెయిరీ టేల్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలను చిన్నచూపు చూసిన బాలీవుడ్ సెలబ్రిటీస్ లో కరీనా ఒకరు. ఇప్పుడు అదే సౌత్ ఇండియా సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది కరీనా కపూర్. ఈ విషయానికొస్తే మన సౌత్ ఇండస్ట్రీ చాలా బాగా ఎదిగింది.
బాలీవుడ్ వాళ్ళని సైతం మన వైపు చూపు తిప్పుకొనేల చేసింది. వాళ్ళ దగ్గర మనకు అవకాశాలు ఇవ్వడం ఎంతో కష్టమవుతున్న సమయంలో వాళ్లకే మనం అవకాశాలు ఇచ్చే స్థితిలోకి వచ్చినట్టు ఈ సంఘటన రుజువు చేస్తుంది. మరి ఈ సినిమా గురించి అంతకుమించి ఏ విషయాలు తెలియలేదు. మిగిలిన వివరాలన్నీ త్వరలోనే వస్తాయి అని చిత్రం బృందం ప్రకటించింది.







వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్.జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది. అలా తన డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా? లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.
ఇప్పుడు ఆ సినిమా వివరాలు, విశేషాలు ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు. కాగా హీరోయిన్ గా కంచికౌల్ నటించింది. ముస్లిం అమ్మాయిగా నటించి యువత మనసు కొల్లగొట్టింది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ తరువాత ఎందుకో అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది.

రాజస్థాన్లోని జై సల్మేర్ లోని ధార్ ఎడారి కి సమీపంలో సిద్ధ తనోత్ రాయ్ మాత ఆలయం ఉంది. 1965,1971 యుద్ధాల సమయంలో జై సల్మేర్ లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ అనేకసార్లు ఈ ఆలయం పై బాంబులు విసిరింది కానీ ఒక్కటి కూడా పేలలేదు. ఆ బాంబులు అన్నీ ఇండియన్ ఆర్మీ అదే ఆలయంలోని మ్యూజియంలో ఉంచింది. ఇలా ఈ ఆలయం పై పాకిస్తాన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వేలసార్లు ఇలాంటి దాడికి పాల్పడింది.


