అలనాటి హీరోయిన్ వాణిశ్రీ అందం, అభినయంతో అప్పటి ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరా అని చర్చలు జరుగుతున్న సమయంలో కళాభినేత్రి వాణిశ్రీ తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొని వచ్చింది.
నవలా నాయికగా గొప్ప పేరు తెచ్చుకుంది. సావిత్రి ప్రభావం తనపై పడకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. దశాబ్దం పాటు తెలుగు ఇండస్ట్రీని మహారాణిలా ఏలారు. ఆ సమయంలో ఏ చిత్రం రిలీజ్ అయినా అందులో హీరోయిన్ మాత్రం వాణిశ్రీనే.
పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఆత్మాభిమానం కల మధ్యతరగతి యువతి క్యారెక్టర్ అయినా, అందం అణుకువ ఉన్న అమ్మాయి అయినా, నవలా నాయికగా నటించాలన్నా అది వాణిశ్రీకి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఆ అదృష్టం ఆమెకే దక్కింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 95 సినిమాలలో నటించిన వాణిశ్రీ, ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. 1962 లో భీష్మ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఆమె. ఆ తరువాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఆమె 40 ఏళ్ల సినీ కెరీర్లో 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, సౌత్ , నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే డా. కరుంకరన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కొడుకు పుట్టిన తరువాత థైరాయిడ్ సమస్య ఏర్పడి, వాణిశ్రీ బాగా లావయ్యారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు వాణిశ్రీ ఇలా మారిపోయరేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో మానవత్వానికి విలువనివ్వడం లేదు. డబ్బుకి, ఆస్తులకు ఇచ్చే విలువలో సగం కూడా కుటుంబ బంధాలకు ఇవ్వడం లేదు. అలా అనడానికి తాజాగా జరిగిన ఒక సంఘటననే ఉదాహరణగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని గామాలపాడు చెందిన ఏడుకొండలు, వెంకటరత్నమ్మలకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని తమకున్నంతలో పెంచి, పెద్ద చేసి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుమారుడు వెంకటేష్ కు వారు భారమయ్యారు.
ఇక ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల వల్ల వెంకటరత్నం పై కొడుకు, కోడలు దాడి చేశారు. దాంతో వెంకటరత్నం చెయ్యి విరిగింది. విషయం బయటికి వస్తుందని కుమారుడు తల్లి పై కాస్త జాలి కూడా లేకుండా నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక తండాలోని శ్మశానవాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత అక్కడికి మొక్కలకు నీళ్ళు పోసే పని చేసే గ్రామపంచాయతీ వర్కర్ శ్రీనివాస్ వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకటరత్నం చూసి వెంటనే సర్పంచ్ కు తెలియచేశాడు.
దాంతో సర్పంచ్, గ్రామస్తులు వెంకటరత్నం వివరాలు తెలుసుకుని పోలీసులకు తెలిపారు. ఆమె ఇంటికి వెళితే కొడుకు, కోడలు తనను చంపేస్తారని భయాందోళనను వ్యక్తం చేసింది. హాస్పటల్ కి తీసుకు వెళ్లమని కన్నీటితో వేడుకొంది. గాయాలతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని పోలీసులు మిర్యాలగూడ హాస్పటల్ కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి, దాచేపల్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటికే సెమీస్ ఫైనల్ కు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ ఆడిన 8 మ్యాచ్ లలో అన్ని గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో సౌతాఫ్రికా జట్టు 12 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా 12 పాయింట్లతో, 0.861 నెట్ రన్ రేట్ తో మూడవ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ శ్రీలంక పై గెలుపుతో పది పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. సెమీస్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఏదో వండర్ జరిగితే తప్ప సెమీ ఫైనల్ కు వెళ్ళడం అసంభవం.
ఈ క్రమంలో అందరి దృష్టి ఇప్పుడు ఫైనల్ కు వెళ్ళే రెండు జట్లు పై ఉంది. ప్రస్తుతం జట్టుకు ఫామ్ ను బట్టి, బలాబలాలు బట్టి భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకుంటాయని అంటున్నారు. దీంతో 2003 ప్రపంచ కప్ ఫైనల్ రిపీట్ కాబోతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ భారత్, ఆస్ట్రేలియా జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. 2003 ప్రపంచ కప్‌లో కూడా భారత్, ఆస్ట్రేలియా జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా మంచి ఫామ్ లో ఉన్నా, లీగ్ దశలో రెండు తడబడటం కనిపించింది.
భారత్ తడబాటు లేకుండానే సెమీస్ కు చేరుకుంది. ఆసీస్ మొదట్లో తడబడినప్పటికీ ఏమాత్రం వెనక్కు వెళ్ళలేదు. ఇక ఈ టోర్నీలో సౌతాఫ్రికా తడబడటం తెలిసిందే. అందువల్ల ఆస్ట్రేలియా రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడిస్తుందని అనుకుంటున్నారు. అలా జరిగితే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓటమి పలు చేసి భారత్ ప్రపంచ కప్ ను అందుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.


















