పవర్ స్టార్ గా ఎదిగి, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ నుండి ఎంతో మందికి సేవ చేశారు. పార్టీ గుర్తు కూడా కొత్తగా ఉంటుంది. ఎన్నికల్లో పార్టీకి గాజు గ్లాసు గుర్తుని ప్రకటించారు. అప్పటి నుండి గాజు గ్లాస్ చూసిన ప్రతిసారి జనసేన పార్టీ గుర్తొస్తుంది. అయితే జనసేన పార్టీ జెండా లో ఉండే చిహ్నానికి కూడా చాలా అర్థం ఉంది. ఒకసారి దీని అర్థం తెలుసుకుంటే, ఇంత ఆలోచించి ఒక పార్టీ జెండా చిహ్నం తయారు చేశారా అని అనిపిస్తుంది. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

# బ్యాక్ గ్రౌండ్ లో తెలుపు రంగు ఉంటుంది. ఇది శాంతిని, ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న భారతీయ నాగరికతను, సంప్రదాయాన్ని సూచిస్తుంది.
# చిహ్నం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది విప్లవానికి గుర్తు. మన పురాతన జాతీయ ధర్మాలని, ఇప్పటి మార్పులతో, వాటిని ఇంకా అభివృద్ధి చేసి చెప్పాలి అనే ఉద్దేశంతోనే తెలుపు మీద ఎరుపు రంగు వచ్చేలాగా డిజైన్ చేశారు.
# చిహ్నంలో నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రానికి ఆరు దిక్కులు ఉంటాయి. ఈ ఆరు దిక్కులు పార్టీ పాటించే ఆరు సూత్రాలని తెలియజేస్తాయి. ఈ సూత్రాలు, విలువలు మనకి మన తరతరాల నుండి వస్తున్నాయి అని దీని అర్థం. నక్షత్రం మధ్యలో ఉండే తెలుపు రంగు స్వయం ప్రకాశాన్ని తెలియజేస్తుంది. మన విలువల వల్ల మన దారిలో మనం సొంతంగా వెలుగుతాం అని దీని అర్థం వచ్చేలాగా డిజైన్ చేశారు.
# నక్షత్రం మధ్యలో ఉండే చుక్క ఆత్మని తెలియజేస్తుంది. మన ఆత్మ మన నిజం. ఈ చుక్కని మధ్యలో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది మన దేశానికి మనం నిజంగా ఏం చేస్తున్నాం అనేది తెలియజేస్తుంది. ఇదే గుండె అంత ముఖ్యమైనది. అందుకే ఈ చుక్క ని మధ్యలో పెట్టారు.
# ఎంబ్లెమ్ చుట్టూ బ్లాక్ లైనింగ్ ఉంటుంది. ఇది విప్లవానికి, అందుకు వచ్చే వ్యతిరేకతని బ్యాలెన్స్ చేసి, సామరస్యంగా ఉంచడానికి సూచిస్తుంది.
# ఈ పార్టీ ఎంబ్లెమ్ అనేది మన దేశం యొక్క జీవితాన్ని, అందుకోసం పోరాటం చేసిన వారి పోరాటాన్ని సూచిస్తుంది.
ఒక్క చిహ్నంలో ఇంత భావం ఉండేలాగా పార్టీ జెండా రూపొందించారు.






1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:






ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్‌ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్‌తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్‌తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్‌బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్‌ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్‌లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.