చాల కాలంగా ఓ అవ్వ తనకు రావాల్సిన పింఛన్ కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంది,కొన్ని నెలలుగా ఆ అవ్వ తిరుగుతున్నా కావడం లేదు. చేసేదేంలేక ఆ అవ్వ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి మెట్లమీద కూర్చుంది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించుకొని కార్యాలయానికి వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ,మంగమ్మను చూసి ఆప్యాయంగా పలకరించి, పెద్దమ్మా ఏం కావాలి,ఎందుకొచ్చారు అని అడిగాడు.
మాములు వ్యక్తిగా భావించిన అవ్వ “అయ్యా నా పేరు మంగమ్మ,నా వయసు 70 ఏళ్ళు ,రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా”ఆన్నది,అయితే ఆ అవ్వకు అయన ఎవరో తెలియదు. మాములు వ్యక్తిగా భావించిన ఆ అవ్వ తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది..వెంటనే ఆ కలెక్టర్ డీఆర్డీవో పీడీ సుమతితో ఫోన్లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది.
కలెక్టర్ మంచితనాన్ని మెచ్చుకొని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.ఈ సన్నివేశం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.ఈ న్యూస్ లోకల్ మీడియాలో వైరల్ గా మారింది,మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉండాలి అని కోరుకుంటున్నారు..తన హోదా ని మరిచిపోయి ఒక సాధారణ వ్యక్తి లాగా సహాయం చేసిన ఈ కలెక్టర్ ని మీరు కూడా అభినందిందండి,అందరికి షేర్ చేయండి.


హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం. “తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనికి దర్శకుడు స్పందించి కేటీఆర్ కు ట్వీట్ చేసారు.






సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చెప్పాలి. ఈ సినిమాని తన భుజం మీద మోసుకొచ్చాడు థమన్. విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు. అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.











గత కొన్ని రోజులుగా ఫారిన్ టూర్స్, డిన్నర్లకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు ఈ జంట. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి కానున్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో కూడా ఉన్నారు. ఈ జోడీ ఫొటో తొలిసారి 2017లో మీడియా దృష్టిలో పడింది. 2019 ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో తన భాగస్వామి రామన్‌తో కలిసి మాక్స్వెల్ రావడంతో పెళ్లి గురించి చర్చ మొదలైంది. తాజాగా మాక్సీ-వినీ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఆసీస్ క్రికెటర్లు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నారు.








