నిజమైన సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం “మేజర్”. ఈ మూవీ 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో హెరిటేజ్ హోటల్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీర మరణం పొందారు.
ఆయన మరణానికి ప్రతీకగా నిజజీవితంలోని ఈ సంఘటన ఆధారంగా అడివి శేష్ ఇందులో మేజర్ పాత్రలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోను చాలా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
దీన్నిబట్టి సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం..? మేజర్ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తీశారు. ఆయన ఎలా చనిపోయారు. అనేది అందరికీ తెలుసు. కానీ ఆయన నిజ జీవితంలో ఎలా బతికారు అనేది కొందరికి మాత్రమే తెలుసు. ఆయన ఎలా మేజర్ అయ్యారు. అనేది ఈ మూవీలో కనబడుతుంది. ఈ మూవీలో మేజర్ చిన్నప్పటి జీవితం, కాలేజ్ జీవితం, ఇలాంటి విషయాలను చాలా బ్రీఫ్ గా ఇందులో చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో మేజర్ పర్సనల్ లవ్ స్టోరీని చూపించారని తెలుస్తోంది.
ఈ సినిమా చూస్తున్నంత సేపు కేకలు, అరుపులు, గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ లో మనం చూస్తున్నంత సేపు రియల్ ఉన్నికృష్ణన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో భయం, బాధ, కోపం ముఖ్యంగా ఉద్వేగం ఇవన్నీ మనకు వచ్చేలా రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది శేష్ సినీ జీవితంలో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఇక మూవీ చూస్తే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మూవీలో మేజర్ సందీప్ ని ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం ఖాయం. అలా మనం ఫీల్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. ఫైనల్ గా మనం ఒక నిజమైన మేజర్ ఎలాంటి కష్టం పడతాడో సినిమా చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క, తెరకెక్కించారు. నిర్మాత మహేష్ బాబు, హీరో అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ, మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, రచయిత అడివి శేష్, నటీనటులు ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్, ఈ మూవీ జూన్ 3వ తేదీన థియేటర్లోకి రానుంది.
watch video :