అనుష్క…పెద్దగా పరిచయం అవసరం లేని పేరు . సూపర్ సినిమా తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి వరుస విజయాలతో దూసుకుపోతోంది. అరుంధతి ,భాగమతి,పంచాక్షరీ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది . బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా లో నటించి తన నటన తో అందరిని మెప్పించి టాప్ ప్లేస్ లో నిలిచింది .
అనుష్క సినిమా ల్లోకి వచ్చిన కొత్త లో 10 లక్షల పారితోషకం తీసుకునేవారు. తర్వాత క్రమంగా తన కి టాలీవుడ్ లో మార్కెట్ పెరగడం తో 5 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే అప్పట్లో మహానటి సినిమా లో అనుష్క నటించాల్సి ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . నాగ్ అశ్విన్ డైరెక్టన్ లో వచ్చిన మహానటి సినిమా ఎంతటి ఘనా విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు . నాగ్ అశ్విన్ మొదట సావిత్రి పాత్ర కోసం అనుష్కను అడగ్గా అప్పటికే భాగమతి తో బిజీ గా ఉన్న అనుష్కకి డేట్లు కుదర్లేదు. దాంతో ఆ అవకాశం కాస్త కీర్తి సురేష్ ని వరించింది. ఈ సినిమా కీర్తి కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలిచిపోయింది. తన నటనతో హావ భావాలతో అందరిని మెప్పించి సావిత్రమ్మ ను గుర్తు చేసారు.
Sunku Sravan
Sunku Sravan
సుంకు శ్రావణ్ కుమార్ 2018 నుంచి 'తెలుగుఅడ్డా' లో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు సినిమా, పాలిటిక్స్ తదితర విభాగాల్లో పని చేశాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, జాతీయ, అంతర్జాతీయ వార్తలను,సినిమా వార్తలను అందిస్తూ ఉంటాను.
సాధారణం గా అందరు బస్సులు రైళ్లు ఎక్కేటప్పుడు మెట్ల ద్వారా ఎక్కుతారు .కాలేజీ విద్యార్థులు కొందరిని ఫుట్ బోర్డు మీద వేలాడుతూ చూస్తూ ఉంటాం. కొంతమంది సీట్ ని ఆపడానికి కిటికిలోనుండి కర్చీఫులు వేయడం మనందరికీ తెలిసిందే .
అయితే రైలు ని కిటికీ లోనుండి ఎక్కడం ఎప్పుడన్నా చూసారా? అదికూడా పురుషులు , విద్యార్థులు కాదు అదీనూ ఒక మహిళ ఎక్కడం ఎప్పుడన్నా చూసారా ?? ఒక మహిళ అసాధారణ రీతిలో రైలు ఎక్కింది. రైలు భోగి బయట నుండి ఎమర్జెన్సీ విండో ద్వారా లోపలి వెళ్ళింది. దానిని చూసిన అందరు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.
Baalakrishna: సిల్క్ స్మిత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ..!
సిల్క్ స్మిత పేరు వినని వారెవ్వరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అంతలా ఫేమస్ అయిన సిల్క్ స్మిత శృంగార తారగా పేరు తెచ్చుకున్నారు.రజినీకాంత్ ,కమల్ హాసన్ ,చిరంజీవి,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించారు.తెలుగు తమిళ మలయాళ,కన్నడ ,హిందీ తో పటు పలు భాషల్లో 450 కి ఓపైగా చిత్రాల్లో నటించి అందరిని మెప్పించారు .
ఆమె ఆడితే 369 సినిమాతో మంచి నటి గా గుర్తింపు పొందారు.ఇటీవలే ఈ చితం ౩౦ సం పూర్తి చేసుకుంది . ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను బాలకృష్ణ పంచుకుంటూ సిల్క్ స్మిత గురించి మాట్లాడారు . “సిల్క్ స్మిత మేకప్, కాస్ట్యూమ్ విషయాలలో ఆవిడని మించిన వారు లేరు అని, ఈ విషయం లో ఆవిడని కొట్టిన ఆడది లేదు” అంటూ మాట్లాడారు.శ్రీదేవి లాంటి పెద్ద హీరోయిన్స్ కూడా సిల్క్ స్మిత మేకప్, కాస్ట్యూమ్ ఫాలో అవుతూ ఇమిటేట్ చేసేవారు అని చెప్పుకొచ్చారు. సిల్క్ స్మిత డాన్సర్ అయినప్పటికి తనని పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అనుసరించడం అంటే అదేమీ చిన్న విషయం కాదు అంటూ సిల్క్ స్మిత పై ఉన్న అభిప్రాయాన్ని చెప్పుకొస్తూ ఆమెను ప్రశంసించారు.
Mahesh Murari:కృష్ణ వంశీ దర్శకత్వం , మహేష్ బాబు హీరో కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు ..?
మహేష్ బాబు రాజకుమారుడు తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను సాధించారు. తర్వాత చిత్రం కృష్ణ వంశీదర్శకత్వం లో వచ్చిన మురారి మహేష్ కెరీర్ లో పెద్ద హిట్ మూవీ అని చెప్పాలి .ఈ సినిమా లో మహేష్ నటనకు స్పెషల్ జ్యురీ నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా తో మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు ముఖ్యం గా లేడీ ఫాలోయింగ్ అయితే మరీ పెరిగిపోయింది.తర్వాత మాస్ సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చి పోకిరి తో స్టార్ గా తన గుర్తింపు ని పెంచుకున్నాడు .
పోకిరి సినిమా తర్వాత మహేష్ తో మురారి సీక్వల్ ను చేయాలి అని కృష్ణ వంశీ అనుకున్నారు .కానీ మాహేష్ అప్పటికే మాస్ సినిమాలతో బిజీ ఉండటం ,ఫ్యామిలీ కంటెంట్ సినిమా అంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని అప్పట్లో వద్దు అనుకున్నారు .కానీ కృష్ణ వంశీ మాత్రం ఎప్పటికైనా మురారి 2 మహేష్ తోనే చేయాలి అనుకుంటున్నారు.మహేష్ మాత్రం అందుకు ఒప్పుకుంటారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది .మహేష్ తో మళ్ళీ మురారి లాంటి సినిమా చూడాలి అని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు .మరీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అని వేచి చూడాల్సిందే.
visakha: నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారుల మృతి…
విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జమ్మ దేవి పేట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు పెద్దేరు వాగు దాటుతుండగా ప్రమాద వశాత్తు నీటి లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఎల్ . గవరవరం గ్రామానికి చెందిన జాహ్నవి ( 11 ) ,ఝాన్సీ( 8 ),షర్మిల ( 7 ), మహీందర్ ( 7 ) గా గుర్తించారు.సోమవారం మధ్యాహ్నం వాగు దాటుతుండగా లోతు ఎక్కువ గా ఉండటం తో ప్రమాదం జరిగింది.
వాగు లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం తో చిన్నారులు వాగు లో కొట్టుకుపోయారు .విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. చిన్నారుల మృతి తో తల్లి తండ్రులు బోరున విలపిస్తున్నారు . అందరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తో ఎల్ .గవరవరం లో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. నలుగురు చిన్నారులూ గిరిజన కుటుంబాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
IND VS SL T20 : కృనాల్ పాండ్యాను తో సన్నిహితంగా 8 మంది ఆటగాళ్లు, ఇంగ్లాండ్ టెస్టుల కోసం ఎంపికైన పృథ్వి, సూర్య తో పాటూ. !
ప్రస్తుతం శ్రీ లంకలో టీం ఇండియా పర్యటిస్తుంది. ఈ టూర్ లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ 20 లు ఆడుతున్న సంగతి తెలిసిందే ఇటీవలే జరిగిన మొదటి టీ 20 లో ఘన విజయం సాధించిన టీం ఇండియా మంగళవారం నాడు టీం ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావటం తో మ్యాచ్ ని బుధవారం రోజుకి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి : IND VS ENG TEST SERIES: ఇంగ్లాండ్ టూర్ కి పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్ !
ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించిన అధికారాలు, కృనాల్ తో ఎనిమిది మంది ఆటగాళ్లు క్లోజ్ గా ఉన్నట్టు తెలిపారు. వీరిలో ఇటీవలే ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపికైన పృథ్వి షా, సూర్య కుమార్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎనిమిది మంది ప్లేయర్స్ లేకుండానే రెండవ టీ t20 నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీరీస్ కోసం ఎంపికైన 24 మంది ఉండగా వారిలో క్రూనాల్ తో పాటు మిగతా ఎనిమిది మంది ఆటగాళ్లు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది.
ind vs england test sereisదేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లకి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. సిరీస్ మొదట్లో లంక బ్యాటింగ్ కోచ్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారింపడం తో సిరీస్ ఆలస్యంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
Navarasa: మణిరత్నం గారి దర్శకత్వ పర్యవేక్షణలో నటించడం ఒక గొప్ప అనుభూతి ! నా కలనిజమైంది : అంజలి
Navarasa: మణిరత్నం గారి దర్శకత్వ పర్యవేక్షణలో లో నటించడం ఒక గొప్ప అనుభూతి : అంజలి తమిళ, తెలుగు సినీ స్టార్స్ తో భారీ తారాగణంతో రూపుదిద్దిన వెబ్ సిరీస్ ‘నవరస’. ఈ వెబ్ సిరీస్ ని వహించారు ‘మణి రత్నం’ నిర్మించారు. ఇందులో తొమ్మిది భాగాలు ఉండగా ఒక్కో ఎపిసోడ్ ని ఒకో దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు.
ఇవి కూడా చదవండి : సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!
సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు, తో పాటుగా తెలుగు హీరోయిన్ ‘అంజలి’ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 6 నుంచి నెట్ ఫ్లిక్ లో విడుదల కానుంది. సుమారు మొత్తం షూటింగ్ భాగాన్ని చిత్రికరించిన యూనిట్. ఇవాళ ట్రైలర్ ని విడుదల చేసారు నిర్మాతలు. ఈ సందర్బంగా టాలీవుడ్ హీరోయిన్ ఈ వెబ్ సిరీస్ పై స్పందిస్తూ.. ” మణిరత్నం గారి దర్శకత్వ పర్యవేక్షణలో పని చేయడం నిజంగా ఒక గొప్ప అనుభూతి, నా కల నిజమైంది’ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ‘నవరస అనే పేరుకు తగ్గట్టుగానే ఉంది ట్రైలర్ అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసారు మణి రత్నం గారు.
https://www.instagram.com/p/CR03D0-JFpZ/?utm_medium=copy_link
Ashok Gajapathi Raju: పదవులు కావాలి బాధ్యతలు పట్టించుకోవా? ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్
Ashok Gajapathi Raju: పదవులు కావలి బాధ్యతలు పట్టించుకోవా? ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ మాన్సాస్ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై ఫైర్ అయ్యారు వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాన్సాస్ ఆదీనం లో ఉన్న పన్నెండు విద్యాసంస్థల సిబ్బంది జీతాల గురించి ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి.
Also Read : మళ్లీ పుష్ప సెట్లోకి అడుగుపెట్టిన సుకుమార్.!
బోర్డుని సమావేశపరచకుండా కాలయాపన చేస్తున్నారని నిధులుకరువై జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మీకు పదవులు కావలి, మరి బాధ్యతలు వద్దా అంటూ సూటిగా ప్రశ్నించారు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎలా అని మాటలు సంధించారు. ”పార్టీ లేదు…బొక్కా లేద’అచ్చన్న ఏనాడో అన్నారని పప్పు బాబు కి పొడుచుకు వచ్చిందని ఎద్దేవా చేసారు. అంతే కాదు టీడీపీ నేత నారా లోకేష్ మీద పరోక్షంగా విమర్శలు సంధించారు. సీట్లకే కాదు ఓట్ల కు కూడా బొక్క పడిందని మండిపడ్డారు.
kaarthika Deepam: కార్తీకదీపం సీరియల్ వంటలక్క మళ్ళీ తల్లికాబోతోందా…?
కార్తీకదీపం సీరియల్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సాయంత్రం అయితే చాలు ఎపుడు వస్తుందా ఆ సీరియల్ అని ఎదురు చూస్తూ ఉంటారు.అత్యంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతోంది.అయితే ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ ప్రేమి విశ్వనాధ్ వంటలక్క గా మనఇంట్లో మనిషి గా కలిసిపోయింది.
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరో గా , లింగ స్వామి దర్శకత్వం లో రాబోతున్న సినిమా లో వంటలక్క నటించబోతున్నారు .ఈ సినిమా లో నటించడానికి వంటలక్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది .లింగ స్వామి స్వయంగా ప్రేమి ఇంటికి వెళ్లి పాత్రను వివరించారు .కణం సినిమా తరహాలో హార్రర్ థ్రిల్లర్ కధాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ సినిమా లో వంటలక్క ఒక చిన్నారికి తల్లిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. కార్తీక దీపం సీరియల్ లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తున్న వంటలక్క మరోసారి తల్లిగా నటించబోతున్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Narappa: ఆ 85 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సాధించలేనిది… నారప్ప సాధించింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న -పెద్ద సినిమాలు అన్ని ఓటిటి లో విడుదల అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే . ప్రపంచ అగ్రగామి ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ పరిస్థితి ముఖ్యంగా ఇండియా లో కొంత దయనీయం గా ఉంది అనే చెప్పాలి . ఇందులో రిలీస్ అయిన ఒక్క మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
వెంకటేష్ నటించిన నారప్ప మాత్రం భారీ వ్యూయర్ షిప్ తో టాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ సినిమా తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ కి రీమేక్ కాగా తెలుగులో వెంకటేష్ నటించారు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ 85 కోట్ల రేటుతో హిందీ లో క్రెజీ చిత్రం ఐన తుఫాన్ సినిమాని కొనుగోలు చేసింది. ఈ సినిమా పై అమెజాన్ ప్రైమ్ భారీ లాభాలు చేకూరతాయి అని అంచనాలు పెట్టుకోగా అది కాస్తా నిరుత్సాహపరిచింది. కానీ 40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన నారప్ప మాత్రం భారీ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. నారప్ప సినిమా తో అమెజాన్ ప్రైమ్ లో టాలీవుడ్ కూడా ఫామ్ లోకి వచ్చినట్లు అయింది. జూన్ నెలలో రిలీజ్ అయిన నారప్ప మాత్రం అందరి అంచనాలను మించి టాప్ ప్లేస్ లో నిలిచింది.