రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం బాగుంది.
చక్కటి పేరు సినిమాకు వచ్చింది. ముఖ్యంగా ఇద్దరి హీరోల మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు.
నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా కూడా ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకి ఒక హైలైట్ అయ్యింది.
ఇలా చెప్పుకుపోతే ఈ సినిమా గురించి చాలా చెప్తూ ఉండాలి. ఏదేమైనా RRR సినిమా అందరికీ నచ్చేసింది. రాజమౌళికి మంచి పేరు కూడా తీసుకు వచ్చింది ఈ సినిమా. అయితే RRR కి ముందు రాజమౌళి సినిమాలని ఇంత మంది స్టార్ యాక్టర్స్ రిజెక్ట్ చేశారట. మరి వారెవరో చూద్దాం.
#1. పవన్ కళ్యాణ్:
విక్రమార్కుడు సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు కానీ దానికి రిజెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్.
#2. సూర్య:
బాహుబలి సినిమాలో సూర్యని ఒక ముఖ్య పాత్ర పోషించమని అడిగారట కానీ దానికి అంగీకరించలేదు.
#3. మోహన్ లాల్:
కట్టప్ప పాత్రని చేయమని రాజమౌళి అడిగారు కానీ మోహన్ లాల్ బిజీగా ఉండడంతో ఒప్పుకోలేదు.
#4. వివేక్ ఒబెరాయ్:
భల్లాల దేవుడి పాత్ర కోసం రాజమౌళి అడగగా కొన్ని కారణాల వల్ల వివేక్ ఒబేరాయ్ ఒప్పుకోలేదు.
#5. జాన్ అబ్రహం:
భల్లాల దేవుడి పాత్ర కోసం రాజమౌళి అడగగా కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదు.
#6. బాలకృష్ణ:
మగధీర సినిమా కోసం ముందు బాలకృష్ణని అనుకున్నారు కానీ ఒప్పుకోలేదు.
#7. హృతిక్ రోషన్:
బాహుబలిలో హీరోగా అనుకున్నారట. కానీ జరగలేదు..
#8. అమితాబ్ బచ్చన్:
కట్టప్ప పాత్రని చేయమని రాజమౌళి అడిగారు కానీ దానికి ఒప్పుకోలేదు అమితాబ్ బచ్చన్.
#9. ప్రభాస్:
సింహాద్రి సినిమాని చేయమని రాజమౌళి అడిగారు కానీ దానికి ఒప్పుకోలేదు ప్రభాస్.
#10. శ్రీదేవి:
శివగామి పాత్రని చేయమని రాజమౌళి అడిగారు కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు.
#12. శ్రద్ధ కపూర్:
RRR సినిమాలో ఒలివియా మోరీస్ చేసిన జెన్నీ పాత్ర కోసం ఆమెను అడిగారట కానీ ఆమె ఒప్పుకోలేదు.
#13. కాజల్:
యమదొంగలో కాజల్ ని పెడదాం అనుకున్నారట రాజమౌళి. కానీ ఆమె చెయ్యలేదు.